వెంకీ ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ మీనాక్షి

‘గుంటూరు కారం’లో చిన్నోడు మహేశ్‌ బాబుతో కలిసి నటించిన మీనాక్షి.. ఇప్పుడు పెద్దోడు వెంకీమామకు జోడీగా నటించనుంది.

టైటిల్‌ ఇంకా ఖరారు కాని.. విక్టరీ వెంకటేష్ 58వ చిత్రంలో మీనాక్షిని ఎంపిక చేసినట్లు చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. 

ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 తర్వాత వెంకటేశ్‌-అనిల్‌ రావిపూడి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేశ్‌ కూడా నటిస్తోంది. ఈమె వెంకీకి భార్యగా, మీనాక్షి ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.  

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి.. ‘ఇచట వాహనములు నిలుపరాదు’తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 

ఆ తర్వాత ‘ఖిలాడి’, హిట్‌ 2’, ‘గుంటూరు కారం’ చిత్రాల్లో నటించింది. కోలీవుడ్‌లో ‘కోలై’, ‘సింగపూర్‌ సెలూన్‌’ చిత్రాలతో అలరించింది.  

ప్రస్తుతం.. తెలుగులో ‘లక్కీ భాస్కర్‌’, ‘విశ్వంభర’, ‘మెకానిక్‌ రాఖీ’, ‘మట్కా’ తదితర చిత్రాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో విజయ్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం’లో నటిస్తోంది. 

సినిమాల్లోకి రాకముందే పలు అందాల పోటీల్లో పాల్గొని టైటిల్స్‌ గెలుచుకుంది. అప్పుడప్పుడు ఫ్యాషన్‌ షోల్లోనూ హొయలొలికిస్తుంటుంది.

త్రివిక్రమ్‌-మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో నటించాలనేది తన కల అని, ‘గుంటూరు కారం’తో అది తీరిపోయిందని ఓ సందర్భంలో తెలిపింది. 

‘నేను ‘గుంటూరు కారం’కి ఓకే చెప్పడానికి కారణం మహేశ్‌బాబు. ఆయన సెట్‌లో ఉన్నంత సేపు చూపు తిప్పేదాన్ని కాదు. అలాగే చూస్తూ ఉండిపోయేదాన్ని’ అని అంటోందీ బ్యూటీ.

This browser does not support the video element.

ప్రకృతిలో గడిపేందుకు ఇష్టపడే ఈమె తరచూ బీచ్‌లు, అడవులకు ట్రిప్‌లు ప్లాన్‌ చేస్తూ ఉంటుంది. అలా ట్రిప్‌కి థాయ్‌లాండ్‌కి వెళ్లినప్పుడు థాయ్‌ కిక్‌ బాక్సింగ్‌నూ నేర్చుకుంది.

టైటిల్‌ ఇంకా ఖరారు కాని విశ్వక్‌సేన్‌ చిత్రంలోనూ మీనాక్షి కనిపించనుంది. ‘పాత్ర ఏదైనా, నిడివి ఎంత అయినా నాకు రోల్స్‌తో ఎక్స్‌పరిమెంట్లు చేయాలనుంది’అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

దుల్కర్‌ సల్మాన్‌ సరసన ‘లక్కీ భాస్కర్‌’లో నటిస్తోంది. ఇటీవల ఇందులో నుంచి ఓ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ అయ్యింది. అది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

This browser does not support the video element.

కట్టు, బొట్టు, అందం, అభినయంతో ఆకట్టుకునే ఈమె పలు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహిరిస్తోంది. ఇన్‌స్టాలో మీనాక్షిని 14లక్షల మంది ఫాలో అవుతున్నారు.

ఎన్ని ఉన్నా.. జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే!

త్రిప్తి వస్తే.. కుర్రకారుకు ఉక్కపోతే!

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

Eenadu.net Home