అలా చేస్తే నాకు నేనే బోర్ కొట్టేస్తా..!
కెరీర్‌లో వేగమే కాదు.. వైవిధ్యమూ అవసరమే. అలా మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ‘లక్కీ భాస్కర్’,‘మెకానిక్ రాకీ’,‘మట్కా’సినిమాలతో సందడి చేయనుంది మీను.
శ్రీలీల..సాయిపల్లవి..తర్వాత డాక్టర్ ప్లస్ యాక్టర్ లిస్ట్‌లో చేరిన మరో నాయిక మీనాక్షి చౌదరి. 2018లో మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచింది.
‘ఇచట వాహనములు నిలుపరాదు’ఆమె తొలి సినిమా. ఇండస్ట్రీలోకి రాకముందు మోడలింగ్ చేసేది.
నటి మీనాక్షి శేషాద్రికి మీను వాళ్ల నాన్న వీరాభిమాని. అందుకే ఆ పేరు పెట్టారు అంటూ తన పేరు వెనక కారణం చెప్పింది.
‘చిన్నతనంలో డాక్టర్- మోడల్- ఐఏఎస్ అవ్వాలనుకున్నా. డాక్టర్, మిస్ ఇండియా అయిపోయా.. సినిమాల నుంచి బ్రేక్ వస్తే తప్పకుండా కలెక్టర్ అవుతా..’అంటోంది.
స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం. ముఖ్యంగా అమ్మ వండే మటన్ బిర్యానీ అంటే ప్రాణం. అలాగే అమ్మతో కలసి వంట చేయడం, పుస్తకాలు చదవడం,స్విమ్మింగ్ హాబీలు.
ఖాళీ సమయాల్లో ఫ్రెండ్స్‌తో కలసి బ్యాడ్మింటన్ ఆడటం, కవితలు రాయడం చేస్తుంటుంది.
ఏ విషయాన్ని అయినా చిటికెలో నేర్చుకునే మీనాక్షి ఎప్పుడూ ఒకే పని చేయడాన్ని ఇష్టపడదు. ‘అలా చేస్తే నాకు నేనే బోర్ కొట్టేస్తా.. ’అంటోంది.
ఈమె నేచర్ లవర్. తన స్పెషల్ డేస్‌ని ప్రకృతితో మమేకమై జరుపుకొనేందుకు ఇష్టపడుతుంది.
థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం. అవకాశాలొస్తే తప్పక ఆ సినిమాల్లో నటిస్తానంటోంది.
ఆరడగుల అందగత్తెకు ఇప్పటివరకు ఒక్కరూ ప్రపోజ్ చేయలేదు.. ‘ఒకవేళ చేస్తే సినిమాలతో సహజీవనం చేస్తున్నా’అని చెప్తానంటుంది మీనాక్షి.