మీరా.. అందం ఏ మాత్రం తగ్గలేదుగా!

‘గుడుంబా శంకర్‌’తో రొమాన్స్‌ చేసిన మలయాళీ భామ మీరా జాస్మిన్‌ గుర్తుందా..? ఈ సీనియర్‌ హీరోయిన్‌ ఇప్పుడు మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. 

Image: Instagram/Meera Jasmine

ఇరవై ఏళ్ల కిందటే సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటించి.. తనకంటూ అభిమానుల్ని సంపాదించుకుంది.

Image: Instagram/Meera Jasmine 

ఇతర భాషల్లో బిజీగా ఉన్న మీరా.. పదేళ్ల తర్వాత ‘విమానం’తో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం జూన్‌ 9న విడుదలకానుంది. 

Image: Instagram/Meera Jasmine

సముద్రఖని ప్రధాన పాత్రలో దర్శకుడు శివ ప్రసాద్‌ యానాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మీరా జాస్మిన్‌తోపాటు అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, మాస్టర్‌ ధ్రువన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Image: Instagram/Meera Jasmine

‘‘విమానం’ కథ వినగానే ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను. కథ బాగుంది.. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది మీరా. 

Image: Instagram/Meera Jasmine

వయసు పెరిగినా.. మీరా అందం ఏ మాత్రం తగ్గలేదు. సోషల్‌మీడియాలో పోస్టు చేసిన తన గ్లామర్‌ ఫొటోలు చూస్తే.. యంగ్‌ హీరోయిన్లకు పోటీనిచ్చేలా కనిపిస్తోంది. 

Image: Instagram/Meera Jasmine

కేరళలోని తిరువల్లలో జన్మించిన మీరా.. డాక్టర్‌ అవ్వాలనుకుందట. అది కుదరకపోవడంతో బీఎస్సీలో చేరింది. చదువుకునే సమయంలోనే మలయాళ చిత్రం ‘సూత్రధారన్‌(2001)’లో నటించి వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. 

Image: Instagram/Meera Jasmine

ఆ తర్వాత తమిళ్‌లో ‘రన్‌’తో అడుగుపెట్టి.. 2003 నుంచి 2014 వరకు బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారింది. ఒక్కో ఏడాది 3 నుంచి 8 సినిమాలు చేసిందంటే.. అప్పట్లో ఈ బ్యూటీకి ఉన్న డిమాండ్‌ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

Image: Instagram/Meera Jasmine

ఇక తెలుగులో ‘అమ్మాయి బాగుంది(2003)’తో ఎంట్రీ ఇచ్చిన మీరా... ‘గుడుంబా శంకర్‌’, ‘భద్ర’, ‘యమగోల మళ్లీ మొదలైంది’, ‘గోరింటాకు’, ‘బంగారు బాబు’ తదితర చిత్రాల్లో నటించింది.

Image: Instagram/Meera Jasmine

దుబాయికి చెందిన ఓ ఇంజినీర్‌ను వివాహం చేసుకున్న తర్వాత క్రమంగా సినిమాలు తగ్గించింది మీరా. 2018లో ‘పూమారమ్‌’లో అతిథి పాత్రలో కనిపించింది. 

Image: Instagram/Meera Jasmine

నాలుగేళ్ల తర్వాత 2022లో మలయాళ చిత్రం ‘మాకల్‌’తో మాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది.

Image: Instagram/Meera Jasmine

ఇప్పుడు టాలీవుడ్‌లో ‘విమానం’తో రీఎంట్రీ ఇస్తోంది. ‘ది టెస్ట్‌’తో తమిళ ప్రేక్షకుల్ని మళ్లీ పలకరించబోతోంది.

Image: Instagram/Meera Jasmine

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home