మెగా హీరోయిన్ల సందడి!

మెగా హీరోలంతా జోరు మీదున్నారు. నెల రోజుల వ్యవధిలో వీరి సినిమాలు వరుసపెట్టి విడుదలకానున్నాయి. ఈ క్రమంలో ఆయా చిత్రాల్లో నటించిన హీరోయిన్లు కూడా వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారెవరంటే..

(Photos: Instagram)

కేతికా శర్మ

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రో’లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వారిలో ఒకరు కేతికా శర్మ. ‘రొమాంటిక్‌’తో పరిచయమై.. ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాల్లో నటించింది. 

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

‘బ్రో’లో మరో హీరోయిన్‌గా ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటిస్తోంది. మలయాళంలో వచ్చిన ‘ఒరు అదార్‌ లవ్‌’తో పాపులరై.. తెలుగులో ‘చెక్‌’, ‘ఇష్క్‌’లో తళుక్కుమంది. 

ఊర్వశీ రౌతెలా

ఈ మధ్య టాలీవుడ్‌ ప్రత్యేక పాటల్లో ఈమెనే కనిపిస్తోంది. ‘బ్రో’లోని ‘మై డియర్‌ మార్కండేయ’ పాటలో ఈ బ్యూటీ ఆడిపాడింది. అంతకుముందు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లోనూ మెరిసింది.

కీర్తి సురేశ్‌

ఇటీవల ‘పెద్దన్న’లో రజనీకాంత్‌కు చెల్లెలిగా నటించిన కీర్తి సురేశ్‌.. ఇప్పుడు ‘భోళా శంకర్‌’లో చిరంజీవికి కూడా సోదరిగా కనిపించనుంది.

తమన్నా

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ తమన్నా.. ‘భోళా శంకర్‌’లో చిరుకి జోడీగా కనిపించబోతోంది. ఇందులో ఈమె లాయర్‌గా నటిస్తోంది.

శ్రీలీల

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ నాలుగో చిత్రం ‘ఆదికేశవ’. ఇందులో టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ శ్రీలీల.. వైష్ణవ్‌కు జోడీగా సందడి చేయనుంది. 

సాక్షి వైద్య

వరుణ్‌ తేజ్‌ ‘రా’ ఏజెంట్‌గా నటిస్తోన్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. వరుణ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రమిది. ఇందులో ‘ఏజెంట్‌’ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది.  

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home