చిరంజీవి.. ఘనతలివీ

#eenadu

పర్సనల్‌ వెబ్‌సైట్‌ కలిగిన తొలి భారతీయ నటుడు. https://www.kchiranjeevi.com/ ఇందులో ఆయన గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకోవచ్చు.

ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’ వేడుక (1987)లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు. 

1999- 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా ‘సమ్మాన్‌’ అవార్డు అందుకున్నారు. 

‘పసివాడి ప్రాణం’ సినిమాతో బ్రేక్‌ డ్యాన్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

‘బావగారు బాగున్నారా’ చిత్రంలో బంగీజంప్‌ చేశారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం 240 అడుగుల ఎత్తునుంచి దూకారు.

ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన అరుదైన రికార్డు చిరంజీవిదే.

అత్యధిక పారితోషికం (రూ. కోటికిపైగా) అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లో వార్తల్లో నిలిచారు.

‘ఘరానా మొగుడు’ (1992), ‘ఇంద్ర’ (2002).. వసూళ్లపరంగా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించాయి.

రష్యన్‌లోకి డబ్‌ అయిన తొలి తెలుగు చిత్రం.. చిరంజీవి నటించిన ‘స్వయంకృషి’.

1980, 1983లో చిరంజీవి నటించిన 14 చిత్రాలు (ఒక్కో ఏడాదిలో) విడుదలవడం విశేషం. ప్రస్తుతం 156వ సినిమా ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు.

‘సుప్రీం హీరో’, ‘మెగాస్టార్‌’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ఆయన పద్మవిభూషణ్‌, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.

రవీనా టాండన్‌ వారసురాలు.. భలే చలాకీ!

యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ!

ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌..

Eenadu.net Home