గోరింటాకు బాగా పండితే ఏమవుతుందంటే...!
గోరింటాకు అమ్మాయిల కలల పంట..చేతినిండా ఎర్రగా పండితే మంచి మొగడొస్తాడని నమ్ముతారు.. ఆ గోరింటాకు ఎర్రగా పండేందుకు ఏం చేయాలి..? దీనిలో ఎలాంటి ఆరోగ్య ఫలితాలుంటాయో తెలుసుకోండి..!
image:RKC
మైదాకు ఎర్రగా పండేందుకు మహిళలు రకరకాల చిట్కాలు పాటిస్తారు. కొందరు నూనె కలుపుతారు. మరికొందరూ నిమ్మకాయ పిండుతారు.
image:RKC
చేతులు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత గోరింటాకు పెట్టుకోవాలి. ఆ తర్వాత 12 గంటలకు మెహందీని శుభ్రం చేసుకుంటే చక్కగా పండుతుంది. ముందుగానే కడిగితే సరిగా పండదు.
image:RKC
సబ్బుతో కడగొద్దు. ఒక చేయిని మరొక చేయితో రుద్దుకోవాలి. కొద్ది సేపటి తర్వాత చల్లని నీటితో వాష్ చేయాలి..
image:RKC
ఆరిపోతున్న మైదాకుపై అప్పుడప్పుడూ బెల్లం మరిగించిన నీటిని వేయాలి. ఆ తర్వాత చేతులు ఎర్రగా పండుతాయి.
image:RKC
మెహందీ ఎర్రగా పండాలంటే లవంగాల పొగ ఆవిరి పట్టొచ్చు. అరచేతిని తాకేలా ఉంటే అందమైన రంగుల చేతులు మీ సొంతమవుతాయి.
image:RKC
మెహందీని సాధారణ వాతావరణంలోనే ఆరేలా చూసుకోవాలి. హెయిర్ డ్రయ్యర్‌తోగానీ మంట దగ్గర పెట్టొద్దు. దీంతో చేతులు మంటలేచే ప్రమాదం ఉంది.
image:RKC
మహిళలు గోరింటాకును ఏడాదికి రెండుసార్లు పెట్టుకుంటే హార్మోన్లు సరిగా పని చేస్తాయి. అనారోగ్య సమస్యలున్నా పోతాయి.
image:RKC
మెహందీ పెట్టుకోవటంతో వర్ష, చలి కాలంలో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు. ఇన్‌ఫెక్షన్లు సోకే వీలుండదని నిపుణులు చెబుతున్నారు.
image:RKC