మైగ్రేన్‌ తలనొప్పి తగ్గేదెలా!

కాస్త పని ఒత్తిడి ఎక్కువవగానే తలనొప్పి మొదలవుతుంది. ఇది సాధారణమైనదైతే ఫర్వాలేదు. మైగ్రేన్‌ తలనొప్పి అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

image:RKC

అసలు మైగ్రేన్‌ తలనొప్పి లక్షణాలేంటి? దాని పర్యవసానాలేంటో తెలుసుకుందాం.

image:RKC

దీనిని పార్శ్వ నొప్పి అని కూడా అంటారు. విపరీతమైన తలనొప్పితో ఈ సమస్య మొదలవుతుంది. ఎక్కువగా నొప్పి ఉన్నప్పటికీ ప్రమాదకరమైంది కాదు. అసలు ఈ నొప్పి ఎందుకొస్తుందో సరైన కారణం తెలియదు.

image:RKC

 నాడీకణాలు అతిగా స్పందించటం వల్ల తల, ముఖానికి వెళ్లే ట్రైజిమినల్‌ నాడికి తప్పుడు సంకేతాలు అందుతాయి. అప్పుడు కొన్ని రసాయనాలు విడుదలై మెదడు పొరలోని రక్తనాళాలల్లో వాపు, నొప్పి తలెత్తుతాయి. దీన్నే పార్శ్వనొప్పి అంటారు.

image:RKC

ఈ నొప్పి తలకు ఒకే వైపు, ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది కళ్లు తిరగటం, వికారంగా ఉండటం, వెలుగు చూడలేకపోవటం వంటి సమస్యలు వస్తాయి.

image:RKC

ఇది ఏ వయసులోనైనా రావచ్చు. కొందరికి కొన్ని రోజుల వ్యవధిలోనే తగ్గిపోవచ్చు. మరికొందరికి తరచూ వస్తూ ఉండొచ్చు.

image:RKC

ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. రోజూ వ్యాయామం చేయాలి. రోజులో ఓ అరగంట ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

image:RKC

పని ఒత్తిడి, తినే ఆహార పదార్థాలు, వాతావరణ మార్పులు, నిస్సత్తువ, నిద్రలేమి, భోజనం సమయానికి తినకపోవటం వల్ల ఈ సమస్య రావచ్చు. అందుకే సమయానికి తినేయాలి. పండ్లు ఎక్కువగా తినాలి.

image:RKC

ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. మరీ నొప్పి ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ వంటి మామూలు నొప్పి మాత్రలు వేసుకోవచ్చు.

image:RKC

ఒత్తిడి ఎక్కువైతే తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది. నొప్పి భరించలేనంతగా ఉంటే న్యూరాలజిస్టును సంప్రదించేందుకు ఆలోచించకూడదు. 

image:RKC

రక్తహీనతకు అనేక కారణాలు అంటున్నారు వైద్యులు..

ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించే ఆహారం!

లివర్‌ కొవ్వుకి ఈ ఆహరపదార్థాలే కారణం!

Eenadu.net Home