పాలు తాగితే..మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు..!

పాలు ఎన్నో పోషకాల సమాహారం. విటమిన్లు, ఖనిజాలు అందులో లభిస్తాయి. ప్రతి రోజు ఒక గ్లాసు పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలుంటాయి. వాటిని ఓసారి పరిశీలించండి..!

image:EENADU

మనకు గుడ్డు ఎంత ఆరోగ్య కరమో..పాలూ అంతే. ఏ వయసు వారైనా రోజూ పాలు తాగితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

image:EENADU

పాలు సంపూర్ణ ఆహారం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు ఎ,డి,బి కాంప్లెక్సు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, జింక్‌, కాల్షియం లాంటి మినరల్స్‌ అందుతాయి.

image:EENADU

పాలు తాగడంతో ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు బలంగా తయారవుతుంది

image:EENADU

పాలు తాగడంతో అదనపు కొవ్వు చేరదు. పెరిగిన బరువును కూడా తగ్గించుకోవచ్చు. అంత బాగా పని చేస్తాయన్నమాట..!

image:EENADU

పాలు చిన్నారులు, వృద్ధుల కండరాలకు బలాన్నిస్తాయి. నీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తాయి.

image:EENADU

శరీరంలో ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు తోడ్పడుతుంది. వీటికి అవసరమయిన బి విటమిన్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి.

image:EENADU

రోజూ పాలు తాగడంతో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.

image:EENADU

పాలతో చర్మ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. నల్లమచ్చలు కూడా రావు. చర్మం నిగనిగలాడుతుంది. 

image:EENADU

మల బద్దకం సమస్య ఉన్న వారు రోజూ గోరు వెచ్చని పాలు తాగితే ఫలితం ఉంటుంది. శారీరక అలసట లేకుండా చేస్తుంది.

image:EENADU

తృణధాన్యాలు.. ఆరోగ్యానికి ఏంతో మేలు

అలర్జీలు ఎందుకొస్తాయో తెలుసా?

మజ్జిగ .. మేలేంతో తెలుసా..?

Eenadu.net Home