‘మిల్కీ బ్యూటీ’ సింగర్ సంజన గురించి తెలుసా..
సంజన దివాకర్ కల్‌మంజీ.. దక్షిణాదిన మంచి ప్లేబ్యాక్ సింగర్.. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో పాటలు పాడుతుంటారు. ఇప్పుడు చిరంజీవి కొత్త చిత్రం ‘భోళా శంకర్’లో ‘మిల్కీ బ్యూటీ..’ అనే పాటతో శ్రోతల ముందుకొచ్చారు.
image: instagram/ sanjanakalmanje
‘మిల్కీ బ్యూటీ...’ పాటను కంపోజ్ చేసింది మణిశర్మ కుమారుడు, సంజన భర్త మహతి స్వర సాగర్. 2021లో సాగర్‌ను వివాహం చేసుకొని సంజన మణిశర్మ ఇంటి కోడలయ్యారు.
image: instagram/ sanjanakalmanje
ఈమె 1995లో కర్ణాటకలో పుట్టారు. చదువంతా చెన్నైలో సాగింది. చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేదట. స్కూలు, కాలేజీలో స్టేజీపై పాటలు పాడారు.
image: instagram/ sanjanakalmanje
సూపర్ సింగర్ జూనియర్ 2 ప్రోగ్రామ్‌లో పాల్గొని ట్రోఫీని గెలుచుకున్నారు. మలయాళ చిత్రం ‘కవాల్’లో ‘నట్ట నాడు ఇరువుల...’ అనే పాటతో 2015లో కెరియర్‌ని మొదలుపెట్టారు.
image: instagram/ sanjanakalmanje
‘డిక్టేటర్’, ‘జూమ్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కృష్ణా వ్రింద విహారి’, కన్నడ ‘ఆరెంజ్’, ‘లవ్ టుడే’,‘ఛల్ మోహన్‌రంగ’ తదితర చిత్రాల్లో పాటలు పాడి ఆకట్టుకున్నారు.
image: instagram/ sanjanakalmanje
సంజనకు పండగల సమయంలో పూజలు చేసి, అమ్మతో కలిసి ఫొటోలు దిగటం అంటే బాగా నచ్చుతుందట.
image: instagram/ sanjanakalmanje
ఖాళీ సమయం దొరికితే స్నేహితులతో కలసి రీల్స్ చేస్తూ, ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
image: instagram/ sanjanakalmanje
వర్షంలో తడుస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేయడమంటే ఈమెకి చాలా ఇష్టమట. ప్రకృతిని ఆస్వాదించేందుకు అప్పుడప్పుడూ ట్రిప్పులకీ వెళ్తుంటారు.
image: instagram/ sanjanakalmanje