టాలీవుడ్‌లోకి మరో మలయాళీ భామ 

తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మిర్నా మేనన్‌. ఇప్పుడీ భామ టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.

Image:Instagram/Mirnaa Menon

ఆది సాయికుమార్‌ హీరోగా ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ‘క్రేజీ ఫెలో’ తెరకెక్కుతోంది. ఇందులో ఆది సరసన దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image:Instagram/Mirnaa Menon

ఈ మలయాళీ ముద్దుగుమ్మ మరో తెలుగు చిత్రంలోనూ నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

Image:Instagram/Mirnaa Menon

అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ‘ఉగ్రం’లో హీరోయిన్‌గా ఎంపికైంది.

Image:Instagram/Mirnaa Menon

కేరళలోని ఇడుక్కిలో1994 డిసెంబరు 15న జన్మించింది మిర్నా మేనన్‌. ఆమె తండ్రి వ్యాపారవేత్త.

Image:Instagram/Mirnaa Menon

చెన్నైలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివింది.

Image:Instagram/Mirnaa Menon

ఆమె తమిళ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ నటించిన తొలి సినిమా ‘సంతాన దేవన్’ మధ్యలోనే ఆగిపోయింది.

Image:Instagram/Mirnaa Menon

2020లో ‘బిగ్‌ బ్రదర్‌’తో మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Image:Instagram/Mirnaa Menon

2022లో ప్రముఖ ఓటీటీ ‘జీ5’లో విడుదలైన ‘అనంతం’ వెబ్‌ సిరీస్‌లో నటించింది.

Image:Instagram/Mirnaa Menon


ఓనం పండగ సందర్భంగా ముస్తాబై దిగిన ఫొటో ఇది.

Image:Instagram/Mirnaa Menon

మిర్నా మేనన్‌కు ఫేస్‌బుక్‌లో 1.4 మిలియన్‌, ఇన్‌స్టాలో 3 లక్షలకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:Instagram/Mirnaa Menon

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home