మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస 

‘దేవకి నందన వాసుదేవ’తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కానుంది మానస వారణాసి. అర్జున్‌ జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమాలో అశోక్‌ గల్లా హీరో. ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.  

మిడిల్‌క్లాస్‌లో పుట్టినా ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎదిగి.. మిస్ ఇండియా 2020 పోటీల్లో గెలిచి కిరీటాన్ని దక్కించుకుంది.

హైదరాబాద్‌కు చెందిన మానస పాఠశాల విద్యను గ్లోబల్‌ ఇండియన్‌ స్కూల్‌లోనూ, కళాశాల విద్యను వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలోనూ పూర్తి చేశారు. 

దేశంలో బాలల రక్షణ చట్టాలను బలోపేతం చేసేందుకు, పిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘వి కెన్’ అనే కార్యక్రమం ద్వారా ప్రచారం చేస్తోంది.

అందం, అభినయంతో మెప్పించే ఈ తెలుగమ్మాయికి కాస్త భయంతో పాటూ.. సిగ్గూ ఎక్కువే. మనసులోని భావాలను బయటపెట్టేందుకు భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.

21 సంవత్సరాలకే మోడలింగ్‌పై దృష్టి సారించిన మానస కెరీర్‌ మీద శ్రద్ధతో అందం, ఫిట్‌నెస్‌ విషయాల్లో కఠినమైన నియమాలు పాటిస్తుంది. 

మానస వారణాసి జంతు ప్రేమికురాలు.. తరచూ పెంపుడు శునకాల ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటుంది.

 కొవిడ్‌ సమయంలో కుట్లు, అల్లికలు నేర్చుకుంది. వాటిని తన సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మానసకి అడ్వెంచర్లు చేయడంతో పాటూ.. స్కై గేజింగ్‌ అంటే ఇష్టం.

పుస్తకాలు చదవడం, సంగీతం, యోగా వంటివి ఆసక్తి.

తీరా ఈవెంట్‌లో సెలబ్రిటీల సందడి

ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే..

బ్రేక్‌ వస్తే ఐలాండ్‌.. ఛాన్స్‌ వస్తే రాజమౌళి మూవీ!

Eenadu.net Home