19 ఏళ్లకే మిస్ఇండియా.. ఇప్పుడు మిస్‌వరల్డ్ బరిలో..
రాజస్థాన్‌లోని కోటాకు చెందిన నందినీ గుప్తా 2023లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అప్పుడు ఆమె వయసు 19.
ఇప్పుడు తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ పోటీలు మేలో నిర్వహించనున్నారు.
ఈమె రాజస్థాన్‌లో 2004లో జన్మించింది. స్థానికంగానే బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. నాన్న సుమిత్ గుప్తా వ్యాపార వేత్త.
మిస్ వరల్డ్‌గా ప్రియాంక చోప్రాకు దక్కిన అరుదైన గౌరవం, కిరీటాన్ని చూసి.. పదేళ్ల వయసు నుంచే తనూ ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకోవాలని కలలు కన్నది.
వయసు పెరుగుతున్నకొద్దీ కిరీటం అందుకోవడం తేలికైన విషయం కాదనీ.. దాని కోసం కష్టపడింది. అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకుంది.
2023లో ‘మిస్ రాజస్థాన్’ కిరీటాన్ని అందుకుంది. అదే ఏడాది ‘మిస్ ఇండియా’ టైటిల్‌ను గెలుచుకుంది.
నందిని కిందటి ఏడాది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ‘ద హీస్ట్’లో అతిథి పాత్రలో కనిపించింది.
ఏ పనిలో బిజీగా ఉన్నా సినిమాలు చూడడం, డ్యాన్స్ చేయడం మాత్రం ఆపదు. ‘జీవితాన్ని ఆస్వాదించాలి అప్పుడే సంతోషంగా ఉంటాం’ అని చెబుతోంది.
సమాజ సేవ చేయడం నందినికి ఇష్టం. ఈ విషయంలో రతన్‌టాటానే తనకు స్ఫూర్తి అని చెప్పింది. అందుకే నందిని స్వస్థలంలో చీరలు నేసే మహిళలకు చేయూతగా ఉంటోంది.
పలు సౌందర్య ఉత్పత్తులకు, జువెలరీ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. ఇవే తనను రీఫ్రెష్ చేస్తాయని అంటోంది.
‘నేను ‘మిస్ వరల్డ్’ కిరీటం గెలుచుకోవాలనేది అమ్మ కల. దాన్ని సాకారం చేసేందుకు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెప్పింది నందిని.