చిన్న పిల్లను బయటకు తీసుకురండి.. చాలు!

‘మిస్ ఇండియా వరల్డ్‌ వైడ్‌ 2024’ అందాల పోటీల్లో ధ్రువీ పటేల్‌ కిరీటం గెలుచుకుంది. 

అమెరికాలో క్వినిపియాక్‌ యూనివర్శిటీలో కంప్యూటర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ కోర్సు చేస్తోంది.

ధ్రువీ కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లినా ఆమె మాత్రం గుజరాతీ అనర్గళంగా మాట్లాడుతుంది.

గతంలో మిస్‌ ఇంగ్లాండ్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆమె... బాలీవుడ్‌లో అవకాశం వస్తే నటించాలన్నది తన కోరిక అంటోంది.

‘3డీ ఛారిటీ’ అనే సంస్థను నడిపిస్తున్న ధ్రువీ.. సామాజిక సేవ తనకి ఆత్మ సంతృప్తిని కలిగిస్తుందని చెబుతోంది.

అనాథలకు ఆహారాన్ని పంచడం, వాలంటీర్‌గా సాయం చేయడం, ఫుడ్‌ డ్రైవ్స్‌లో పాల్గొనడం ఆమెకు బాగా ఇష్టం.

రీల్స్‌ చేయడం ఇష్టం. స్నేహితులతో కలసి చేసిన ఫన్నీ వీడియోలు, డ్యాన్స్‌ రీల్స్‌ను షేర్‌ చేస్తుంటుంది.

‘అప్పుడప్పుడు మనలో ఉన్న చిన్న పిల్లలను బయటకు రానివ్వాలి. దీని వల్ల ఎంత పని చేసినా.. ఒత్తిడి అనిపించదు’ అని చిట్కా చెప్పింది.

ప్రకృతి బాగా నచ్చుతుంది. బీచ్‌లో గడపడం, మంచుతో ఆడుకోవడం ప్రశాంతతను కలిగిస్తాయంటోంది.

ప్రాంతం మారినా సంస్కృతి మారదు అంటూ.. హిందూ పండగలు చేసుకోవడంతో పాటు.. చీరలు, పట్టు వస్త్రాల్లో సందడి చేస్తుంటుంది.

మెదడుకు పదును పెట్టేద్దామిలా

గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్‌-10 ఫుడ్‌

పెళ్లి బంధం దృఢంగా మారాలంటే ఇవి పాటించాల్సిందే!

Eenadu.net Home