సన్‌సెట్‌.. కప్‌కేక్స్‌.. ఇవే మిస్‌ టీన్‌ ఫేవరెట్స్‌

ఇంటర్నేషనల్‌ మిస్‌ టీన్ యూనివర్స్‌ 2024 పోటీలో ఒడిశాకు చెందిన తృష్ణా రే కిరీటాన్ని అందుకుంది.

దక్షిణాఫ్రికాలోని క్లింబరీలో ఇటీవల ఈ అందాల పోటీలు నిర్వహించారు. వివిధ దేశాల మోడళ్లతో పోటీ పడి 19ఏళ్ల తృష్ణ మిస్‌ టీన్‌ యూనివర్స్‌గా గెలిచింది

భువనేశ్వర్‌లోని కేఐఐటి యూనివర్శిటీలో తృష్ణ ఫ్యాషన్‌ టెక్నాలజీ చేస్తోంది. గత ఏడాది భారత్‌ మిస్‌ టీన్‌ యూనివర్స్‌ పోటీలోనూ గెలిచింది. 

ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్‌ కల్నల్‌ దిలీప్‌ కుమార్‌. ఫ్యాషన్‌ మీద ఉన్న ఆసక్తితో ఫ్యాషన్‌ టెక్నాలజీలో చేరింది. ఇప్పుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. 

‘ఇక్కడి వరకూ రావడానికి ఎంతో హార్డ్‌వర్క్‌ చేశాను. నా ప్రతి అడుగులోనూ తల్లిదండ్రులు అండగా ఉన్నారు’ అని గర్వంగా చెబుతోంది.

గులాబి రంగు అంటే ఇష్టం. ఇన్‌స్టాలో ఎక్కువగా పింక్‌ కలర్‌ డ్రెస్సులతో ఉన్న ఫొటోలే ఉంటాయి. 

సంప్రదాయ నృత్యం అంటే ఇష్టంతో కథక్‌లో శిక్షణ తీసుకుంది. స్టేజ్‌ ప్రదర్శనలూ ఇస్తోంది.

సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. మ్యాగజీన్‌ కవర్‌ ఫొటోలకూ పోజులిచ్చింది.

‘ట్రెండీగా ఉండటం ఇష్టం.. ట్రెడిషనల్‌గా ఉండటం ఇంకా ఇష్టం. పండగలు వస్తే చీర కట్టాల్సిందే..’ అని చెప్పింది.

సన్‌సెట్‌ సమయంలో అడవిలో సఫారీని మించి ఇంకేవీ అందంగా ఉండవు అని తన ఇష్టాలను తెలిపింది.

‘ఫిట్‌నెస్‌ కోసం హెల్దీ ఫుడ్‌నే తీసుకుంటా. పిజ్జా, పరోటా, అమ్మ చేసే బూరెలు తినకుండా ఉండలేను. ఇక కప్‌కేక్‌లైతే స్వయంగా చేసుకొని లాగించేస్తాను’ అని ఫుడ్‌ హ్యాబిట్స్‌ చెప్పింది.

వివిధ దేశాల్లో.. వివిధ సంస్కృతులు

కలర్ ఆఫ్‌ ద ఇయర్‌.. మోచా మూస్‌

నూతన సంవత్సరంలో.. రీస్టార్ట్‌ చేద్దాం!

Eenadu.net Home