రెడ్‌.. రైడ్‌.. రియాకు ఇవి ఎంతిష్టమో!

జైపుర్‌లో ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024’అందాల పోటీలు నిర్వహించారు. ఇందులో గుజరాత్‌కు చెందిన రియా సింఘా మొదటి స్థానంలో నిలిచి కిరీటాన్ని గెలుచుకుంది. 

19 ఏళ్ల రియా ‘గ్లోబల్‌ మిస్‌ యూనివర్స్‌ 2024’ పోటీలకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.

 అహ్మదాబాద్‌లో పుట్టిన రియా జీఎల్‌ఎస్‌ యూనివర్శిటీలో చదువుతోంది. మోడల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది.

వివిధ అందాల పోటీల్లో పాల్గొంటున్న ఆమె.. భారత్‌ నుంచి 2023లో ‘మిస్‌ టీన్‌ ఎర్త్‌’ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి మహిళగా గుర్తింపు పొందింది.

‘ఇంతకు ముందు కిరీటం గెలుచుకున్న స్త్రీలనే స్ఫూర్తిగా తీసుకొని నా ప్రయాణం మొదలు పెట్టాను. ఈ కిరీటానికి నేను తగిన అమ్మాయిగా భావిస్తాను’ అని అంది రియా.

ఆమెకు స్విమ్మింగ్‌ అంటే ఇష్టం. ‘పూల్‌లో దిగానంటే సమయమే తెలియదు. అసలు బయటకే రావాలనిపించదు’ అంటోంది.  

స్నేహితులతో కలసి ట్రిప్‌లకు వెళ్తుంటుంది. అది కూడా ఎక్కువగా అడవుల్లోకే. ప్రకృతిలో గడపితే ఒత్తిడి తగ్గుతుంది అని చెబుతోంది.

అందానికి, ఆరోగ్యానికీ ప్రాధాన్యం ఇస్తుంది. ‘జిమ్‌ చెయ్యడం వల్ల ఆరోగ్యంగా మాత్రమే కాదు.. అందంగానూ కనిపిస్తాం.. ట్రై చేసి చూడండి’ అని సలహా ఇస్తోంది.

సోదరితో కలిసి రాత్రి వేళల్లో కారులో చక్కర్లు కొడుతుంది. ఇది తనకి చాలా సంతోషాన్నిస్తుందని చెప్పింది.

రియాకు ఇష్టమైన రంగు ఎరుపు. ఇన్‌స్టాలోనూ రెడ్‌ కలర్‌ డ్రెస్సుల్లో ఉన్న ఫొటోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home