‘ఓరి దేవుడా..’ ఇంత అందమా..!

‘మురంబ’ అనే మరాఠీ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకున్న మిథిలా పాల్కర్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

Image:Eenadu

విష్వక్‌ సేన్‌ హీరోగా రూపొందిన ‘ఓరి దేవుడా’లో మిథిలా సందడి చేసింది. అక్టోబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image:Eenadu

కోలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంలో వెంకటేశ్‌ కీలకపాత్రలో కనిపించారు. Image:Eenadu

మిథిలా పాల్కర్‌ 1993 జనవరి 12న ముంబయిలో జన్మించింది. బాంద్రాలోని ఎమ్‌ఎమ్‌కే కాలేజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.

Image:Eenadu

‘మజా హనీమూన్’ (2014) అనే షార్ట్‌ ఫిల్మ్‌లో తొలిసారి నటించింది. 16వ ముంబయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ షార్ట్‌ ఫిల్మ్‌ని ప్రదర్శించారు.

Image:Eenadu  

అనంతరం ‘కట్టి బట్టీ’లో ఇమ్రాన్ ఖాన్ సోదరి పాత్రలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా మిథిలా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘మ్యాగీ’, ‘టాటా టీ’, ‘జొమాటో’ ప్రకటనల్లో మెరిసింది.

Image:Eenadu

మిథిలా పాల్కర్‌.. 2017లో విడుదలైన ‘మురంబ’తో మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నటనకుగాను ‘ఉత్తమ పరిచయ నాయిక’ (మరాఠీ)గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుని అందుకుంది.

Image:Eenadu

‘ఎ బేబీ సిట్టర్స్‌ గైడ్‌ టూ మాన్‌స్టర్‌ హంటింగ్‌’ అనే ఇంగ్లీష్‌ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది.

Image:Eenadu 

‘గర్ల్ ఇన్‌ ది సిటీ’, ‘లిటిల్‌ థింగ్స్’,‘అఫీషియల్‌ చుక్యగిరి’ వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించింది.

Image:Eenadu

మిథిలా పాల్కర్‌కు ఇన్‌స్టాలో 3.6 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image:Eenadu

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

Eenadu.net Home