బ్యూటిఫుల్ వెజిటేరియన్.. జాక్వెలిన్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. పెటా సంస్థ నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ వెజిటేరియన్ అవార్డుని అందుకుంది. ఈ సందర్భంగా జాక్వెలిన్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..
వెజ్ లైఫ్‌స్టైల్‌ని పాటించడమే కాకుండా.. విజయవంతంగా ప్రచారం చేస్తున్నందుకుగానూ ఈమెకి అవార్డు ఇచ్చినట్టు పెటా తెలిపింది.
‘ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. శాకాహారులుగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవడమే కాకుండా.. పర్యావరణానికి మంచి చేకూర్చిన వారమవుతాం’ అంటోంది జాక్వెలిన్.
జాక్వెలిన్ 1985లో బహ్రెయిన్‌లో పుట్టింది. మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2009లో ‘అల్లాదీన్’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
14 ఏళ్ల వయసులోనే ఓ టీవీ షోని హోస్ట్ చేసింది. ఆ తర్వాత కొంత కాలం పరిశ్రమకి దూరంగా ఉంది. చదువు పూర్తయ్యాక మోడలింగ్ మొదలుపెట్టింది.
2006లో మిస్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ 15 ఏళ్ల కెరీర్‌లో.. దాదాపు 30 సినిమాలకు పైగా నటించింది.
స్పెషల్ సాంగ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ప్రభాస్ ‘సాహో..’లో ‘బ్యాడ్ బాయ్..’ పాటతో మొదటి సారిగా తెలుగు తెరపై మెరిసింది.
అనాథలకు సాయం చేసేందుకు ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోంది. బీచ్ అంటే ఈ బ్యూటీకి ఇష్టం. శుభ్రంగా ఉంచాలని చెబుతూ.. అప్పుడప్పుడు తనూ బీచ్‌లోని చెత్తను క్లీన్ చేస్తుంటుంది.
పుస్తకాలు చదవడం, డ్యాన్స్ చేయడం, స్విమ్మింగ్ ఈమె హాబీలు. షారుఖ్ ఖాన్, ఏంజిలీనా జోలీలకు వీరాభిమాని.
పెంపుడు జంతువులతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో ఎక్కువగా పంచుకుంటుంది. ఈమె ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 7 కోట్లకు పైమాటే..