ఈ భామలు బాగా బిజీ..!

యంగ్‌ హీరోయిన్లు బిజీగా మారిపోయారు. ప్రేక్షకుల్లో క్రేజ్‌ సంపాదించి.. వరుసపెట్టి అవకాశాలను దక్కించుకుంటున్నారు. అలా ఎవరెవరు ఏయే చిత్రాల్లో నటిస్తున్నారో చూద్దామా.. 

(Photos: Instagram)

శ్రీలీల

రామ్‌తో ‘స్కంద’, వైష్ణవ్‌తేజ్‌తో ‘ఆదికేశవ’, బాలకృష్ణతో ‘భగవంత్‌ కేసరి’, నితిన్‌తో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’, మహేశ్‌బాబుతో ‘గుంటూరు కారం’, విజయ్‌ దేవరకొండతో ‘వీడీ12’, పవన్‌ కల్యాణ్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, నవీన్‌ పొలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’లో నటిస్తోంది. 

మీనాక్షి చౌదరి

‘హిట్‌’తో సక్సెస్‌ అందుకున్న మీనాక్షి.. మహేశ్‌బాబుతో ‘గుంటూరు కారం’, విశ్వక్‌సేన్‌తో ‘వీఎస్‌10’, వరుణ్‌తేజ్‌తో ‘మట్కా’లో నటిస్తోంది. 

నేహా శెట్టి

‘డీజే టిల్లు’ రాధిక.. ప్రస్తుతం కార్తికేయతో ‘బెదురులంక 2012’, కిరణ్‌ అబ్బవరంతో ‘రూల్స్‌ రంజన్‌’, విశ్వక్‌సేన్‌తో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాలతో బిజీగా ఉంది. 

కీర్తి సురేశ్‌

‘భోళా శంకర్‌’లో చిరంజీవి సోదరి పాత్ర పోషించిన కీర్తి.. ఆ తర్వాత వరసగా నాలుగు తమిళ చిత్రాల్లో(సైరెన్‌, రఘు తాత, రివాల్వర్‌ రీటా, కన్నివేడి)నటిస్తోంది.

రష్మిక మందన్న

అల్లు అర్జున్‌తో ‘పుష్ప 2’, బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’లో నటిస్తోన్న నేషనల్‌ క్రష్‌ రష్మిక.. ‘రెయిన్‌బో’తో తొలిసారి విమెన్‌ సెంట్రిక్‌ చిత్రం చేస్తోంది. 

ఐశ్వర్య రాజేశ్‌

మహిళా ప్రాధాన్యమున్న చిన్న చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తోన్న ఐశ్వర్య రాజేశ్‌.. రెండు తమిళ(మోహన్‌దాస్‌, తీయవర్‌ కులైగల్‌ నడుంగా)చిత్రాలు, మూడు (అజయంటే రాండామ్‌ మోషనమ్‌, పులిమెడ, హర్‌) మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. 

సాక్షి వైద్య

‘ఏజెంట్‌’ బ్యూటీ సాక్షి.. ఇప్పటికే వరుణ్‌తేజ్‌తో ‘గాండీవధారి అర్జున’లో నటించగా.. దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌’లో హీరోయిన్‌గా ఎంపికైంది. 

మృణాల్‌ ఠాకూర్‌

‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ నాని ‘హాయ్‌ నాన్న’తోపాటు విజయ్‌ దేవరకొండతో ఓ చిత్రంలో నటిస్తోంది. హిందీలో ‘పూజా మేరీ జాన్‌’, ‘పిప్పా’, ‘ఆంఖ్‌ మిచోలీ’తో బిజీగా ఉంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home