రంగురంగుల ఇళ్లు.. చూస్తే కనువిందు! 

బో-కాప్‌

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉంటుందీ ప్రాంతం. ఇక్కడి ఇళ్లన్నీ 1850కి ముందు నిర్మించినవే. ఇక్కడ స్థిరపడ్డ దేశవిదేశీ ప్రజలు వారికి నచ్చిన రంగుల్ని ఇంటికి వేశారు. అలా ఈ ప్రాంతంలోని ఇళ్లన్నీ రంగులమయమయ్యాయి.

Image: Pixabay

బురానో

ఇటలీలోని చిన్న ఐలాండ్‌ ఇది. ఇక్కడి ఇళ్లన్నీ రంగురంగుల్లో ఒక క్రమపద్ధతిలో ఉంటాయి. ఎవరైనా తమ ఇంటి రంగు మార్చుకోవాలంటే.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలి. వాళ్లు చెప్పే రంగుల్లోనే ఒక రంగును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

Image: Pixabay

చెఫ్‌షావన్‌

మొరాకోలోని ఈ చిన్న పట్టణంలో ఇళ్లన్నీ నీలిరంగులోనే ఉంటాయి. ఆకాశానికి, స్వర్గానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా ఇక్కడ ఇళ్లకు నీలిరంగు వేసుకుంటారని చెబుతుంటారు. 

Image: Pixabay

గ్యాటపే

కొలంబియాలోని గ్యాటపేలో ప్రతి ఇల్లు రంగులతో నిండి ఉంటుంది. తలుపులు, కిటికీలు, ఇలా ఒక్కోదానికి ఒక్కో రంగు వేస్తుంటారు. ఈ ఊర్లో పెద్ద బండరాళ్లుంటాయి. పర్యటకులు వాటిపైకి ఎక్కి చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించొచ్చు. 

Image: Pixabay

హవాన

క్యూబా దేశ రాజధాని. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడ ఇళ్లన్నీ ఎక్కువగా గులాబీ, పసుపు, నీలి రంగుల్లో కనిపిస్తాయి. 

Image: Pixabay

ఇజమల్‌

మెక్సికోలో ఉన్న ఈ ప్రాంతంలో ఇళ్లన్నీ పసుపు రంగులో ఉంటాయి. ఇక్కడి సంప్రదాయాలు మాయన్‌ నాగరికతతో ముడిపడి ఉంటాయి. ఇప్పటికీ మాయన్‌ భాష మాట్లాడేవారిని ఇక్కడ చూడొచ్చు. 

Image: Pixabay

జయపుర

భారత్‌లోని రాజస్థాన్‌లో ఉన్న జయపురని ‘పింక్‌ సిటీ’అని కూడా పిలుస్తుంటారు. బ్రిటీష్‌ పాలనలో ప్రిన్స్‌ వేల్స్‌కు వెల్‌కమ్‌ చెప్పడానికి జయపురలోని అన్ని నిర్మాణాలకు గులాబీ రంగును వేశారట. యునెస్కో గుర్తించిన ఎన్నో వారసత్వ సంపదలు ఇక్కడ ఉన్నాయి. 

Image: Pixabay

రెయిన్‌బో విలేజ్‌

తైవాన్‌లోని తైయిచూంగ్‌ ప్రాంతంలో సైనికుల కోసం నిర్మించిన ఊరు. కొన్నాళ్లకు చాలా మంది ఈ ఊరిని వదిలివెళ్లిపోయారు. పాడుబడ్డ ఈ ఇళ్ల కూల్చివేతను ఆపడానికి ఓ సైనికుడు ఊర్లోని ఇళ్లకు ఇలా పెయింటింగ్స్‌ వేశాడు.

Image: Pixabay

ఫావెలా శాంటా మార్టా

బ్రెజిల్‌లోని రియో డి జనిరోలోని ఓ స్లమ్‌ ప్రాంతం. 2010లో స్లమ్‌ ప్రాంతాల్ని సుందరంగా తీర్చిదిద్దాలని బ్రెజిల్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాని ఫలితమే ఈ రంగురంగుల ఇళ్లు.

Image: Pixabay

కోల్‌మా

‘ది లిటిల్‌ వెనీస్‌ ఆఫ్ ఫ్రాన్స్‌’గా పిలిచే ఈ ప్రాంతం జర్మనీ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడి ఇళ్లన్నీ రంగురంగులతో కనువిందు చేస్తుంటాయి. 

Image: Pixabay

నైహవెన్‌

డెన్మార్క్‌లోని కోపెన్‌హాగ్‌ పోర్ట్‌ ప్రాంతంలో ఉన్న ఈ చోటు కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంటుంది. కారణం.. వరుసగా ఉన్న ఇక్కడి ఇళ్లన్నీ ప్రకాశవంతమైన రంగులతో ఉంటాయి. 

Image: Pixabay

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

Eenadu.net Home