ట్రాఫిక్‌లో చిక్కుకున్న టాప్ 10 నగరాలివీ..!
గ్లోబల్ లొకేషన్ టెక్నాలజీ కంపెనీ టామ్‌టామ్ నివేదిక ప్రకారం.. భారత్‌లో వాహనాలతో అత్యంత రద్దీగా, ఇరుకుగా ఉన్న టాప్ 10 నగరాల జాబితా ఇదీ..
Image:Pixabay
1. బెంగళూరు
ఈ నగర జనాభా 1.36 కోట్లు. ఇక్కడ వాహనదారులు ఏడాదికి 243 గంటలు(సుమారుగా 10 రోజులు) ట్రాఫిక్‌లోనే సమయాన్ని వెచ్చిస్తున్నారట. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఈ నగరం నంబర్ వన్ స్థానంలో ఉంది.
Image:Pixabay
2. ముంబయి
ఇక్కడ 2.12 కోట్ల జనాభా ఉంటుంది. దేశ ఆర్థిక రాజధానికి ఉపాధి నిమిత్తం ఎంతో మంది వలస వచ్చి నివసిస్తుండటం, పర్యటకుల తాకిడితో ట్రాఫిక్‌జామ్ చాలా అవుతోంది.
Image:Pixabay
3. దిల్లీ
దేశ రాజధాని దిల్లీలో 3.29 కోట్ల ప్రజలు ఉంటే.. వాహనాలు వాళ్లకు మించి ఉన్నాయి. దీంతో రోడ్లపై ట్రాఫిక్‌తోపాటు వాయు కాలుష్యంతోనూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
Image:Pixabay
4. కోల్‌కతా
ఈ నగరంలో 1.53 కోట్ల జనాభా ఉంటే.. వాహనాల సంఖ్య అంతకు మించి ఉంది. పాత సిటీ కావడం, రోడ్లు కాస్త ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి.
Image:Pixabay
5. పుణె
ఈ నగరంలో 1.04 కోట్ల జనాభా ఉంటుంది. పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగుల సంఖ్య ఎక్కువే. ఆఫీసులకెళ్లే వాహనాలతో ట్రాఫిక్‌జామ్‌తోపాటు వాయు కాలుష్యం అధికంగానే ఉంటోంది.
Image:Pune Govt website
6. హైదరాబాద్
చారిత్రక నగరమైన హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిపోయింది. 1.08 కోట్ల స్థానిక జనాభాతోపాటు ఎంతో మంది వివిధ పనుల నిమిత్తం ఈ నగరానికి వస్తూపోతుంటారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళలో ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది.
Image:RKC
7. చెన్నై
ఈ నగరంలో 64లక్షల జనాభా ఉంది. మెట్రో సిటీ కావడంతో స్థానికులతోపాటు దేశవిదేశాల నుంచి ప్రజల రాకపోకలు సాగుతుంటాయి. దీంతో ట్రాఫిక్ పెరుగుతోంది.
Image:RKC
8. అహ్మదాబాద్
ఈ నగరంలోనూ ట్రాఫిక్ రద్దీ ఎక్కువే. 26 లక్షల జనాభా ఉన్నా.. రోడ్లపై వాహనాల నియంత్రణ సరిగా లేదని నిపుణులు చెబుతున్నారు. అందుకే, నగరవాసులు ట్రాఫిక్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Image:akshardham
9. సూరత్
టెక్స్‌టైల్ పరిశ్రమకు నిలయం. దాదాపుగా 80లక్షల జనాభా ఉంటుంది. వాహనాల రాకపోకలు ఎక్కువ. వీటికి సరిపోయినంతగా రోడ్లు లేవు. అందుకే ట్రాఫిక్‌లోనే ఎక్కువ సమయం వృథా అవుతుంది.
Image:Gujarat govt website
10. జైపుర్
ఇది అందమైన నగరం. 42 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతానికి ఏటా లక్షల మంది పర్యటకులు వస్తుంటారు. ఈ క్రమంలో వాహనాల రద్దీ పెరుగుతోంది.
Image:Pixabay