టీ20 ప్రపంచకప్‌లో ఎక్కువసార్లు డకౌట్ అయింది వీరే 

షాహిద్‌ అఫ్రిది 

ఈ పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ టీ20 ప్రపంచకప్‌లో 34 మ్యాచ్‌లు ఆడి 5 సార్లు డకౌట్‌ అయ్యాడు.

Image:SocialMedia

తిలకరత్నె దిల్షాన్‌ 

శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నె దిల్షాన్‌ టీ20 ప్రపంచకప్‌లో 35 మ్యాచ్‌లు ఆడి ఐదుసార్లు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌ చేరాడు.

Image:SocialMedia 

రోలోఫ్ వాన్ డెర్ మెర్వే

నెదర్లాండ్స్‌ ఆల్‌రౌండర్‌ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడి 4 సార్లు డకౌటయ్యాడు.

Image:SocialMedia

లెండల్ సిమన్స్‌ 

వెస్టిండీస్‌ మాజీ ఓపెనర్‌ లెండిల్ సిమన్స్ పొట్టి ప్రపంచకప్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 4 సార్లు డకౌటయ్యాడు.

Image:SocialMedia 

సనత్‌ జయసూర్య

శ్రీలంక మాజీ ప్లేయర్‌ సనత్‌ జయసూర్య టీ20 ప్రపంచకప్‌లో 18 మ్యాచ్‌లు ఆడి 4 సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు.

Image:SocialMedia

 ఆండ్రీ రసెల్ 

విండీస్‌ వీరుడు ఆండ్రీ రసెల్‌ టీ20 ప్రపంచకప్‌లో 22 మ్యాచ్‌లు ఆడి నాలుగు సార్లు ఒక్క పరుగు కూడా చేయకుండానే నిష్క్రమించాడు.

Image:SocialMedia

లూక్ రైట్

ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు లూక్‌ రైట్‌ టీ20 ప్రపంచకప్‌లో 22 మ్యాచ్‌లు ఆడి 4 సార్లు డకౌటయ్యాడు.

Image:SocialMediasocialmedia

 ఆశిశ్‌ నెహ్రా 

టీమ్‌ఇండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఆశిశ్‌ నెహ్రా టీ20 ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌లు ఆడి మూడు సార్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు.

Image:SocialMedia

తన్వీర్‌ అప్జల్‌ 

హాంకాంగ్‌ ఆటగాడు తన్వీర్‌ అప్జల్‌ టీ20 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి మూడు సార్లు డకౌట్‌ అయ్యాడు.

Image:SocialMedia

 కాలమ్ మాక్లియోడ్

స్కాట్లాండ్‌ బ్యాటర్‌ కాలమ్ మాక్లియోడ్ టీ20 ప్రపంచకప్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 3 సార్లు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్‌ చేరాడు.

Image:SocialMedia

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home