నిమ్రత్ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో అత్యధికంగా వెతికిన నటుల్లో నిమ్రత్ కౌర్ 8వ స్థానంలో నిలిచింది.
చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఈ ఏడాది నిమ్రత్ పేరు నెట్టింట మార్మోగింది.
2005లో ‘యహాన్’తో అతిథి పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నిమ్రత్. ‘వన్‌నైట్ విత్‌ద కింగ్’ అనే ఆంగ్ల చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
‘ఎన్‌కౌంటర్’, ‘పెడ్లర్స్’, ‘ఎయిర్ లిఫ్ట్’, ‘దాస్వి’, ‘సజిని షిండే కా వైరల్ వీడియో’ వంటి చిత్రాల్లో నటించింది.
‘సజిని షిండే..’ చిత్రానికి గానూ మూవీఫీల్డ్ స్క్రీన్ అవార్డ్స్ నుంచి ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
సినిమాలే కాకుండా టెలివిజన్ షోస్‌తోనూ అలరిస్తోంది నిమ్రత్. ప్రస్తుతం ‘స్కయి ఫోర్స్’, ‘సెక్షన్ 84’ చిత్రాల్లో నటిస్తోంది.
ఇక సినిమాల కంటే అభిషేక్ బచ్చన్‌తో రిలేషన్‌లో ఉన్నారనే వార్తలే ఆమెకు మరింత ప్రచారం తెచ్చిపెట్టాయి.
ఈ కారణంతోనే ఈ ఏడాది గూగుల్ గ్లోబల్ సెర్చ్‌లో నిమ్రత్ 8వ స్థానంలో నిలిచిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈమెకు అడవులన్నా, ప్రకృతి మధ్య సమయం గడపడమన్నా చాలా ఇష్టం. ట్రిప్ ప్రస్తావన రాగానే పచ్చదనానికే ఓటేస్తుంది.
కాఫీ లేనిదే రోజు గడవదంటున్న ఈ భామ.. ఫిట్‌గా ఉండేందుకు మాత్రం రోజూ యోగా చేస్తానంటోంది.