టీ20 ప్రపంచకప్: ఎక్కువసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ వీళ్లే
మహేల జయవర్ధనే
శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్ధనే టీ20 ప్రపంచకప్‌లో 31 మ్యాచ్‌లు ఆడి 1016 పరుగులు చేశాడు. ఐదుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
Image:RKC
క్రిస్ గేల్
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 33 మ్యాచ్‌ల్లో 965 పరుగులు చేశాడు. ఐదుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెల్చుకున్నాడు.
Image:RKC
షేన్ వాట్సన్
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ 24 మ్యాచ్‌లు ఆడి 537 పరుగులు చేయడంతోపాటు 22 వికెట్లు పడగొట్టాడు. ఇతడు కూడా 5 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
Image:RKC
విరాట్ కోహ్లీ
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడి 845 పరుగులు చేశాడు. ఐదుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
Image:RKC
ఏబీ డివిలియర్స్
మిస్టర్ 360, దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 30 మ్యాచ్‌లు ఆడి 717 పరుగులు చేశాడు. నాలుగు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
Image:RKC
షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది 34 మ్యాచ్‌ల్లో 546 పరుగులు చేసి 39 వికెట్లు తీశాడు. నాలుగు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
Image:RKC
తిలకరత్నె దిల్షాన్
శ్రీలంక మాజీ ప్లేయర్ తిలకరత్నె దిల్షాన్ 35 మ్యాచ్‌లు ఆడి 897 పరుగులు చేశాడు. దిల్షాన్ కూడా నాలుగు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
Image:RKC
మార్లోన్ శామ్యూల్స్
వెస్టిండీస్ మాజీ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ పొట్టి ప్రపంచకప్‌లో 20 మ్యాచ్‌లు ఆడి 530 పరుగులు చేశాడు. మూడు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
Image:RKC
యువరాజ్ సింగ్
టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 31 మ్యాచ్‌ల్లో 593 పరుగులు చేసి 12 వికెట్లు పడగొట్టాడు. 3 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
Image:RKC
ఉమర్ గుల్
పాక్ మాజీ పేసర్ 24 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు పడగొట్టాడు. ఉమర్ కూడా మూడుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
Image:RKC