ప్రపంచంలో ప్రతిష్ఠాత్మక సినీ అవార్డులివీ!

అకాడమీ

ఆస్కార్‌గా పిలిచే ఈ అవార్డు ప్రదానం అమెరికాలో 1929 నుంచి మొదలైంది. హాలీవుడ్‌ సహా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సినిమాలు ఈ ఆస్కార్‌ అవార్డు కోసం పోటీ పడుతుంటాయి.

Image: Facebook

గోల్డెన్‌ గ్లోబ్‌

సినిమా, టెలివిజన్‌ షోలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక అవార్డు ఇది. 55 దేశాలకు చెందిన 90 మంది సభ్యులతో కూడిన ‘హాలీవుడ్‌ ఫారెన్‌ ప్రెస్‌ అసోసియేషన్‌’ 1944 నుంచి ఈ పురస్కారాలను అందజేస్తోంది.

Image: Facebook

బఫ్తా(బీఏఎఫ్‌టీఏ)

‘బ్రిటీష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌(బఫ్తా)’ సంస్థ ఇచ్చే ఈ అవార్డు కోసం దేశీయ సినిమాలతోపాటు అంతర్జాతీయ సినిమాలు పోటీ పడుతుంటాయి. 1949లో తొలి బఫ్తా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. 

Image: Facebook

గోల్డెన్‌ పామ్‌

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.

Image: Facebook

గోల్డెన్‌ లయన్‌

వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.

Image: Facebook

గోల్డెన్‌ లియోపర్డ్‌

లాకర్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.

Image: Facebook

గోల్డెన్‌ పీకాక్‌

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.

Image: Facebook

గోల్డెన్‌ కోంచ్‌

ముంబయి ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.

Image: Facebook

గోల్డెన్‌ క్రో ఫెజెంట్‌

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ కేరళలో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.

Image: Facebook

గోల్డెన్‌ బేర్‌

బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రానికి ఇచ్చే అవార్డు.

Image: Facebook

భారత్‌లో అత్యున్నత సినీ అవార్డులు

నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు

ఏటా దేశీయంగా తెరకెక్కిన ఉత్తమ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సంస్థ.. ఉత్తమ చిత్రాలకు, నటులకు, సాంకేతిక నిపుణులకు ఈ ‘నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు’ను అందజేస్తోంది. 

Image: Facebook

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు

భారతీయ సినీ రంగంలో ‘ఫిల్మ్‌ఫేర్‌’ అనేది మరో ప్రతిష్టాత్మక అవార్డు. మొదట్లో హిందీ చిత్రాలకు మాత్రమే ఇచ్చేవారు. ఆ తర్వాత ‘ఫిల్మ్‌ఫేర్‌-సౌత్‌’ పేరుతో దక్షిణాది చిత్రాలకు.. ఇతర పేర్లతో దేశీయ సినీ ఇండస్ట్రీలకు అవార్డులిస్తున్నారు. 

Image: Facebook

ఐఫా అవార్డు

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్‌(ఐఐఎఫ్‌ఏ).. బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ అవార్డుగా దీన్ని భావిస్తారు. ఎక్కువగా విదేశాల్లోనే ఈ అవార్డు వేడుక జరుగుతుంటుంది. 2016 నుంచి ‘ఐఫా ఉత్సవం’ పేరుతో దక్షిణాది చిత్రాలకూ అవార్డులు ఇస్తున్నారు. 

Image: Facebook

సైమా అవార్డు

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డు(ఎస్‌ఐఐఎంఏ).. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఉత్తమ చిత్రాలకు, ప్రతిభావంతులకు ఈ అవార్డును ఇస్తుంటారు.

Image: Facebook

టాప్‌-10 స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లు.. అస్సలు మిస్సవ్వదు

సినిమాల కోసం ఏమైనా చేస్తా..!

శ్రీవల్లి సంగతులు.. చిత్రాల్లో

Eenadu.net Home