ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ఏదో తెలుసా?

ఒక దేశం పౌరులు ఇతర దేశాల్లో పర్యటించాలంటే వీసా ఉండాలి. కొన్ని దేశాలు మాత్రం అటువంటివి లేకుండా కేవలం పాస్‌పోర్టుతోనే తమ దేశంలో పర్యటించేందుకు వీలు కల్పిస్తున్నాయి.

#pixabay

ఇలా అత్యధిక దేశాల అనుమతి ఉన్న పాస్‌పోర్టును శక్తిమంతమైనదిగా(పవర్‌ఫుల్‌) పరిగణిస్తుంటారు.

#pixabay

 ప్రపంచంలో శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా జపాన్‌ తొలిస్థానంలో నిలిచింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు వీసా లేకుండానే 193 దేశాల్లో పర్యటించవచ్చు.

#pixabay

సింగపూర్‌, దక్షిణ కొరియా దేశాల పాస్‌పోర్టులు ఉన్నవారు మాత్రం 192 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చు. ఈ జాబితాలో రష్యా 50, చైనా 69వ స్థానంలో నిలిచాయి.

#pixabay

వీసా లేకుండా పర్యటించే వీలున్న జాబితాలో భారత్‌ 87వ స్థానంలో నిలిచింది. భారత్‌ పాస్‌పోర్టు ఉన్నవారు 60 దేశాల్లో ముందస్తు అనుమతి (వీసా) లేకుండానే పర్యటించవచ్చు.

#pixabay

చివరి స్థానంలో తాలిబాన్‌ అధికారంలో ఉన్న అఫ్గానిస్థాన్‌ నిలిచింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కేవలం 27 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లవచ్చు.

#pixabay

ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (IATA) సమాచారం ఆధారంగా హెన్లీ&పార్ట్‌నర్స్‌ పరిశోధకుల బృందం ఏటా జాబితా రూపొందిస్తుంది.

#pixabay

ఇందులో భాగంగానే 2022 సంవత్సరానికి గానూ ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌’ పేరుతో తాజా జాబితా విడుదల చేసింది.

#pixabay

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home