ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ వెతికింది వీరి కోసమే!

ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే.. గూగుల్‌లో అన్వేషిస్తాం. అలా ఈ ఏడాది(2022) భారత్‌లో అత్యధిక మంది ఎవరి గురించి వెతికారో తెలుసా?

Source: Google

1. నుపుర్‌ శర్మ

దిల్లీకి చెందిన రాజకీయ నాయకురాలు. భాజపా అధికార ప్రతినిధిగా ఉన్న ఈమె.. ఇటీవల మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగడంతో నుపుర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

Image: Twitter

2. ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి. ఒడిశాలోని ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ద్రౌపది.. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఈ ఏడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచి భారత అత్యున్నత పీఠంపై కూర్చున్న తొలి ఆదివాసీ మహిళగా నిలిచారు.

Image: Twitter

3. రిషి సునక్‌

భారత మూలాలున్న యూకే ప్రధాన మంత్రి. వివాదాల నేపథ్యంలో బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత ఆ పదవి బాధ్యతలను రిషి స్వీకరించారు.

Image: Twitter

4. లలిత్‌ మోదీ

భారత్‌కు చెందిన వ్యాపారవేత్త. వివిధ కారణాలతో విదేశాల్లో ఉంటున్న ఆయన సుస్మితా సేన్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. కొన్ని రోజులకే వీరి ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పడింది.

Image: Twitter

5. సుస్మితా సేన్‌

బాలీవుడ్‌ నటి.. మాజీ విశ్వసుందరి. లలిత్‌మోదీతో ప్రేమాయణం, ఓటీటీలో విడుదలైన ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌తో మళ్లీ నటిస్తుండటంతో ఈమె గురించి తెగ గూగుల్‌ చేశారట నెటిజన్లు.

Image: Twitter

6. అంజలి అరోరా

ఈమె సోషల్‌మీడియా సెలబ్రిటీ, నటి. ఆ మధ్య ‘కచ్చా బాదాం’ పాట ఎంత వైరల్‌ అయిందో తెలిసిందే. ఆ పాటకు స్టెప్పులేసి ఈమె కూడా బాగా పాపులరైంది. లాకప్‌ షోలోనూ పాల్గొంది. 

Image: Twitter

7. అబ్దు రోజిక్‌

తజికిస్థాన్‌కు చెందిన గాయకుడు, నటుడు, బాక్సర్‌. చిన్న పిల్లాడిలా కనిపించే ఇతడి వయసు 19 ఏళ్లు. బీటౌన్‌ బిగ్‌బాస్‌-16లో పాల్గొనడంతో ఇతడి గురించి నెటిజన్లు ఆరా తీశారు. 

Image: Twitter

8. ఏక్‌నాథ్‌ శిందే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి. అధికారంలో ఉన్న శివసేన పార్టీకి చెందిన ఈయన.. పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో శివసేన పార్టీని రెండుగా చీల్చారు. ఉద్ధవ్‌ ఠాక్రేను సీఎం పీఠం నుంచి దించి.. భాజపా మద్దతుతో సీఎం అయ్యారు.

Image: Twitter

9. ప్రవీణ్‌ తాంబే

భారతీయ క్రికెటర్‌. 41 ఏళ్ల వయసులో భారతీయ లీగ్‌లో అరంగేట్రం చేశారు. ప్రవీణ్‌ జీవితం ఆధారంగా ‘కౌన్‌ ప్రవీణ్‌ తాంబే?’ పేరుతో సినిమా విడుదలైంది.

Image: Twitter

10. అంబర్‌ హర్డ్‌

హాలీవుడ్‌ హీరోయిన్‌ అంబర్‌ హర్డ్‌ గతంలో తన మాజీ భర్త జానీ డెప్‌పై గృహహింస కేసు పెట్టింది. దీంతో తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఈమెపై జానీ పరువు నష్టం దావా వేశాడు. దీని గురించి నెట్టింట పెద్ద చర్చే జరిగింది.

Image: Twitter

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home