తల్లయినా తగ్గేదేలే.. అంటోన్న నాయికలు
ప్రణీత..
టాలీవుడ్‌లో ‘బావ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, బాపుగారి బొమ్మగా నిలిచిపోయింది.. ప్రణీత. డెలివరీ అయ్యాక 6 నెలలకు తన వర్కౌట్స్‌ని మొదలు పెట్టింది. మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఎక్కువ సమయం నడవాలని సలహా ఇస్తోంది.
image: instagram/pranitha.insta
ఆలియాభట్..
బిడ్డకు జన్మనివ్వటం అంటే మనం కూడా మళ్లీ పుట్టినట్టే అంటోంది.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. డెలివరీ తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. వాటిని మేనేజ్ చెయ్యటం కోసం క్రమం తప్పకుండా జాగింగ్, జిమ్ వర్కౌట్స్ చేశానంటోంది.
image: instagram/aliaabhatt
కాజల్ అగర్వాల్..
తెలుగు తెరపై స్టార్ హీరోలందరితో నటించిన ఈ చందమామ.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచేసింది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని నెలలకే ఫిట్‌గా మారి, తిరిగి షూటింగ్‌లో పాల్గొంటోంది. యోగానే తన ఫిట్‌నెస్‌కు కారణమంటోంది కాజల్.
image:instagram/kajalaggrwal
సనాఖాన్..
తల్లి అయ్యామంటే శరీరంలో మార్పులు సహజమే. దాని గురించి భయపడితే మానసిక ప్రశాంతత దూరమవుతుంది. అందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు. మానసికంగా బలంగా ఉండి.. శరీరానికి సరితూగే వర్కౌట్స్‌తో, డైట్ ప్లాన్‌తో పూర్వ స్థితికి రావొచ్చని చెబుతోంది.
image: instagram/sanakhaan21
అమీ జాక్సన్..
కొంతమంది డెలివరీ అయ్యాక మామూలు స్థితికి రావడానికి దాదాపు సంవత్సరం పడుతుంది. అమీ జాక్సన్ కేవలం రెండు నెలల్లోనే పూర్వ స్థితికి వచ్చేసింది. స్లిమ్‌గా ఉండేందుకు ప్రతిరోజూ ఓ గంట పాటు స్విమ్మింగ్ చేయాల్సిందేనంటోంది.. అమీ.
image: instagram/iamamyjackson
పూర్ణ...
ఓ బిడ్డకు జన్మనివ్వడంతోనే ఆడవారి జీవితం పరిపూర్ణమవుతుంది. బిడ్డను చూడగానే అంతకు ముందు పడ్డ కష్టమేది కనిపించదు. అలాగే నటి అంటే గ్లామర్ మెయింటేన్ చెయ్యాలి.. అందుకోసం రోజూ యోగాతోపాటు డ్యాన్స్ కూడా చేయాలంటోంది.
image: instagram/shamnakasim
సోనమ్ కపూర్..
డెలివరీ తర్వాత బరువు పెరగకూడదంటే డెలివరీకి ముందు కూడా జాగ్రత్తగా ఉండాలంటోంది సోనమ్. తను కెఫెన్‌కి, చాక్లెట్స్‌కి దూరంగా ఉందట. బయటి ఆహారాన్ని తీసుకోవద్దు. ఇంటి ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకుంటూ, వ్యాయామం చేయాలని సూచిస్తోంది.
image: instagram/sonamkapoor
బిపాసా బసు..
వర్కౌట్ చేయకపోతే డెలివరీ తర్వాత పెరిగే బరువును అదుపు చేయలేమంటుంది.. బిపాసా బసు. ఈమె డెలివరీ తర్వాత ఆరు నెలల్లోనే వర్కౌట్స్‌ని ప్రారంభించింది. రోజూ జిమ్‌కి వెళ్లి శరీరానికి శ్రమ కల్పించేదట. వెయిట్‌లిఫ్టింగ్ తన వ్యాయామంలో అతి ముఖ్యమైనదట.
image: instagram/bipashabasu