భారత మార్కెట్లో విడుదలైన మోటో జీ 72.. ధరెంతంటే?

మోటోరోలా తాజాగా 4జీలో మోటో జీ72 పేరుతో మరో మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

Image: Motorola

ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది.

Image: Motorola

డిస్‌ప్లేలోనే ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌, ప్రాగ్జిమిటీ సెన్సర్‌, ఆంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌ ఉన్నాయి.

Image: Motorola

మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీంట్లో 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. 

Image: Motorola

వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 2 ఎంపీ మాక్రో సెన్సర్‌ కెమెరాలున్నాయి. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇచ్చారు.

Image: Motorola

ఈ మొబైల్‌లో 33 వాట్‌ టర్బో చార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Motorola

ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌ మరొక వర్షన్‌, మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను సపోర్ట్‌ చేస్తుందని సంస్థ చెబుతోంది.

Image: Motorola

మెటిరియోరైట్‌ బ్లాక్‌, పోలార్‌ బ్లూ రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 18,999. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలయ్యాయి.

Image: Motorola

హ్యాకర్స్‌లో.. వైట్‌, బ్లాక్‌, గ్రే... తెలుసా?

IRCTCలో ఈ విషయాలు తెలుసా?

జియో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home