మోటోరోలా నుంచి మరో లో బడ్జెట్‌ మొబైల్‌!

మోటోరోలా సంస్థ తాజాగా తమ ‘ఈ’ సిరీస్‌ నుంచి మరో లో బడ్జెట్‌ మొబైల్‌ను విడుదల చేసింది.

Image: Motorola

మోటో ఈ 22ఎస్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ 4జీ మొబైల్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు.

Image: Motorola

మీడియాటెక్‌ హీలియో జీ37 ప్రాసెసర్‌ వాడారు. 4 జీబీ ర్యామ్‌, 64 ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు.

Image: Motorola

వెనుకవైపు 16 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Image: Motorola

ఇందులో 10 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Motorola

సింగిల్‌ స్పీకర్‌, ఫేస్‌ అన్‌లాక్‌, సైడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఫీచర్స్‌ ఇచ్చారు.

Image: Motorola

ఆండ్రాయిడ్‌ 12తో పనిచేసే ఈ మొబైల్‌ ఆర్కిటిక్‌ బ్లూ, ఎకో బ్లాక్‌ రంగులో లభించనుంది.

Image: Motorola

అక్టోబర్‌ 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలుకానున్నాయి. ధర రూ. 10వేలు ఉంటుందని అంచనా. 

Image: Motorola

ఫొటోలో టెక్ట్స్‌నూ ట్రాన్స్‌లేట్ చేయొచ్చు

ఫోన్‌లో ఏ పార్ట్‌ ఎక్కడిదో తెలుసా..?

మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

Eenadu.net Home