మోటోరోలా నుంచి 200ఎంపీతో ఫ్లాగ్‌షిప్ మొబైల్!
మోటోరోలా తాజాగా భారత్‌లో ‘ఎడ్జ్ 30 అల్ట్రా’ మోడల్ మొబైల్‌ను విడుదల చేసింది.
Image: Motorola
ఈ 5జీ మొబైల్‌లో 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది.
Image: Motorola
స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను వాడారు. ఆండ్రాయిడ్ 12తో వచ్చిన ఈ మొబైల్ మరో 3 వెర్షన్లకూ సపోర్ట్ చేస్తుందట.
Image: Motorola
వెనుకవైపు 200 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 50 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 12 ఎంపీ పోట్రైట్ సెన్సర్ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 60 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
Image: Motorola
ఇందులో 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 125 వాట్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్, 10 వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
Image: Motorola
దీంట్లో డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే డ్యుయెల్ స్టీరియో స్పీకర్స్, 2 మైక్రో స్పీకర్స్ ఉన్నాయి. హెడ్‌ఫోన్ జాక్ ఉండదు.
Image: Motorola
ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ రంగుల్లో ఈ మొబైల్ లభిస్తోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్‌లో విక్రయాలు మొదలయ్యాయి.
Image: Motorola
ఈ మొబైల్ 8 జీబీ/128 జీబీ వేరియంట్ ధర రూ.59,999 కాగా.. 12జీబీ/256 జీబీ వేరియంట్ ధర రూ.64,999గా ఉంది. వివిధ ఆఫర్ల కింద డిస్కౌంట్ లభిస్తోంది.
Image: Motorola