అదిరిపోయే లుక్‌తో మోటో ఎడ్జ్‌ 50 ప్రో

This browser does not support the video element.

ఎడ్జ్‌ 50 ప్రో 5జీ ఫోన్‌ను ఏప్రిల్‌ 3న మోటోరొలా భారత్‌లో లాంచ్‌ చేసింది. ఏప్రిల్‌ 9 నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయి.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ ఆఫర్‌ కింద 8జీబీ+256జీబీ రూ.27,999కు, 12జీబీ+256జీబీ రూ.31,999కు విక్రయించనున్నారు.

ఏప్రిల్‌ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మోటో ఆన్‌లైన్‌ స్టోర్లలో కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. బ్లాక్‌ బ్యూటీ, లక్స్‌ లావెండర్‌, మూన్‌లైట్‌ పెర్ల్‌ రంగుల్లో లభిస్తుంది.

మోటో ఎడ్జ్‌ 50 ప్రోలో 6.7 అంగుళాల 1.5K pOLED కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్‌ రేటుకు సపోర్ట్‌ చేస్తుంది. 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.

This browser does not support the video element.

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ను మర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హెలో యూఐతో వస్తోంది. మూడు అప్‌డేట్స్‌ వస్తాయి.

వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా OISతో వస్తోంది. 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌, 10 టెలిఫొటో లెన్స్‌ అమర్చారు. సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా ఉంది.

4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 125W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు, 50W వైర్‌లెస్‌ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

12జీబీ వేరియంట్‌తో మాత్రమే 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఇస్తున్నారు. బేస్‌ వేరియంట్‌తో 68W ఫాస్ట్‌ ఛార్జర్‌ మాత్రమే బాక్స్‌లో ఉంటుంది. ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది.

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు విశేషాలు..

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

ఏఐ రాణించలేని ఉద్యోగాలేంటో తెలుసా?

Eenadu.net Home