మోటోరోలా బడ్జెట్‌ ఫ్రెండ్లీ మొబైల్‌!

మోటోరోలా సంస్థ తాజాగా లోబడ్జెట్‌లో ‘మోటో e13’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Image: Motorola

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. 

Image: Motorola

దీంట్లో యూనిసాక్‌ టీ606 ప్రాసెసర్‌ను వాడారు. దీంతోపాటు మాలి-జీ57 ఎంపీ1 జీపీయూ ఉంది. 

Image: Motorola

ఈ మొబైల్‌లో 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. 

Image: Motorola

వెనకవైపు 13 ఎంపీ కెమెరా.. ముందువైపు 5 ఎంపీ షూటర్‌ కెమెరా ఇచ్చారు.

Image: Motorola

ఇందులో 10వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్‌ 13 గో వెర్షన్‌తో పనిచేస్తుంది. 

Image: Motorola

2జీబీ / 64 జీబీ వేరియంట్‌ ధర రూ. 6,999 కాగా.. 4జీబీ / 64 జీబీ వేరియంట్‌ ధర రూ. 7,999. 

Image: Motorola

కాస్మిక్‌ బ్లాక్‌, ఆరోరా గ్రీన్‌, క్రీమీ వైట్‌ రంగుల్లో లభించనుంది. జియో కనెక్షన్‌తో తీసుకుంటే.. రూ.700 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంది. 

Image: Motorola

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home