మోటో రేజర్‌ 50 అల్ట్రా.. మడత ఫోన్‌ వివరాలివే..

మోటోరొలా రేజర్‌ 50 అల్ట్రా పేరుతో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను జులై 4న భారత్‌లో లాంచ్‌ చేసింది.

క్వాల్‌కామ్‌ కొత్త స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌తో పనిచేస్తుంది.

ఫుల్‌ హెచ్‌డీ+ పీఓలెడ్‌, 165Hz రీఫ్రెష్‌ రేటుతో 6.9 అంగుళాల డిస్‌ప్లే, ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌, 165Hz రీఫ్రెష్‌ రేటుతో వస్తోంది.

50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫొటో సెన్సర్‌ సెటప్‌ను ఇచ్చారు. లోపలి డిస్‌ప్లేపై 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

30X ఏఐ సూపర్‌ జూమ్‌, ఏఐ యాక్షన్‌ షాట్‌, ఏఐ అడాప్టివ్‌ స్టెబిలైజేషన్‌, ఇంటెలిజెంట్‌ ఆటో ఫోకస్‌ ట్రాకింగ్‌ వంటి కెమెరా ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీని ఇచ్చారు. 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ 12జీబీ + 512జీబీ వేరియంట్‌ ధర రూ.99,999. మిడ్‌నైట్‌ బ్లూ, స్ప్రింగ్‌ గ్రీన్‌, పీచ్‌ ఫజ్‌ రంగుల్లో లభించనుంది.

జులై 10 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. జులై 20 నుంచి అమెజాన్‌, రిలయన్స్‌ స్టోర్లతో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విక్రయానికి అందుబాటులో ఉండనుంది. 

ఫోన్‌తో పాటు కంపెనీ కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌నూ ఇస్తోంది. అంతే కాదండోయ్‌ రిటైల్‌ బాక్స్‌లోనే ఫోన్‌ కేస్‌ కూడా అందిస్తోంది.

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

Eenadu.net Home