మౌనీరాయ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

తన నటనతో వెండితెరతోపాటు బుల్లితెరపై అలరిస్తున్న మౌనీరాయ్‌ ‘బ్రహ్మాస్త్ర’తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచేసింది. అందాల ఈ సుందరి.. లేడీ విలన్‌గా ప్రేక్షకులను మెప్పిస్తోంది.

Image:Instagram 

రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీరాయ్‌ కీలకపాత్రలో నటించి మంచి గుర్తింపు పొందింది.

Image:Instagram

ఇతిహాసాల ఆధారంగా అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబరు 9న విడుదలైన ఈ సినిమాకు విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే! ఈ సుందరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

Image:Instagram 

ఈ భామ.. 1985 సెప్టెంబరు 29న పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌లో జన్మించింది. తల్లిదండ్రుల ఒత్తిడితో న్యూ దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులో చేరింది. Image:Instagram 

చిన్నప్పటి నుంచే నటనంటే ఆసక్తి ఉండటంతో కోర్సును మధ్యలోనే ఆపేసి చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబయికి వెళ్లింది.

Image:Instagram

2004లో అభిషేక్‌ బచ్చన్‌, భూమిక చావ్లా జంటగా వచ్చిన ‘రన్‌’లో ప్రత్యేక గీతంలో తొలిసారి వెండితెరపై మెరిసింది.

Image:Instagram 

అనంతరం బుల్లితెరకే పరిమితమైన మౌనీరాయ్‌.. 2011లో ‘హీరో హిట్లర్‌ ఇన్‌ లవ్‌’ అనే పంజాబీ సినిమాలో నటించింది. Image:Instagram

 ‘కేజీయఫ్‌: ఛాప్టర్‌ 1’ (హిందీ వెర్షన్‌)లో ‘గాలి గాలి’ అనే స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడింది.

Image:Instagram  

దుబాయ్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సూరజ్‌ నంబియార్‌ని 2022 జనవరిలో వివాహమాడింది.

Image:Instagram 

మౌనీరాయ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ గ్లామర్‌ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 24.4 మిలియన్ల ఫాలోవర్లున్నారు.

Image:Instagram 

మౌనీరాయ్‌.. టెలివిజన్లో పదుల సంఖ్యలో సీరియల్స్‌ చేసింది. ముఖ్యంగా ‘నాగిని’ సీరియల్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. పలు షోలకు కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది.

image:instagram

This browser does not support the video element.

ప్రస్తుతం మౌనీరాయ్‌.. ‘ది వర్జిన్‌ ట్రీ’లో కీలక పాత్రలో నటిస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ 2022 నవంబర్‌లో చిత్రబృందం విడుదల చేసింది.

image:instagram

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home