సినిమా పేరులో వారం.. ఆసక్తికరం

ఆదివారం

బ్రహ్మానందం, కోవై సరళ, గీతాసింగ్‌, తెలంగాణ శకుంతల తదితరులు ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’. రాజా వన్నెంరెడ్డి తెరకెక్కించారు. విడుదల: 2007.

సోమవారం

కాంతారావు, దేవిక, శోభన్‌ బాబు, కైకాల సత్యనారాయణ తదితరులు నటించిన సినిమా ‘సోమవారం వ్రత మహత్యం’. 1963లో విడుదలైంది.

మంగళవారం

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న ‘మంగళవారం’ నవంబరు 17న రిలీజ్‌ కానుంది. 

బుధవారం

నసీరుద్దీన్‌ షా, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు నటించిన చిత్రం ‘ఎ వెడ్నస్‌డే’. నీరజ్‌ పాండే దర్శకుడు. విడుదల: 2008 సెప్టెంబరు 5.

గురువారం

శ్రీసింహా కథానాయకుడిగా మణికాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. విడుదల: 2021 మార్చి 27.

శుక్రవారం

కేఆర్‌ విజయ, బేబీ షామిలి, బేబీ సితార ప్రధాన పాత్రల్లో రూపొందిందిన సినిమా ‘శుక్రవారం మహాలక్ష్మి’. 1992లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

శనివారం

‘అంటే సుందరానికీ!’ తర్వాత నాని- దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. సినిమా తాజాగా ప్రారంభమైంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home