‘విమానం’ కథ.. భావోద్వేగం కదా!

.

 ప్రేమవిమానం

విమానం ఎక్కాలని ప్రయత్నించే కొందరి జీవితాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. సంగీత్‌ శోభన్‌, శాన్వీ, అనసూయ, వెన్నెల కిశోర్‌ తదితరులు నటించారు. సంతోశ్‌ కటా దర్శకత్వంలో రూపొందింది. నేరుగా ఓటీటీ ‘జీ 5’లో ఇటీవల విడుదలైంది.

తేజస్‌

సర్వేశ్‌ మేవారా డైరెక్షన్‌లో కంగనా రనౌత్‌ నటించిన చిత్రమిది. భారత వాయుసేన సత్తా చాటే ఈ సినిమాలో కంగన పైలెట్‌గా కనిపిస్తుంది. అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 విమానం

విమానం ఎక్కాలనే కొడుకు కోరిక నెరవేర్చే ఓ మధ్య తరగతి తండ్రి కథే ఇది’. సముద్రఖని, అనసూయ, మాస్టర్‌ ధ్రువన్‌ ప్రధాన పాత్రల్లో శివ ప్రసాద్‌ యానాల తెరకెక్కించారు. ఈ జూన్‌లో విడుదలైంది. ప్రస్తుతం ‘జీ 5’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఆపరేషన్‌ వాలెంటైన్‌

వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకుడు. ఇందులో వరుణ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌గా కనిపించనున్నారు. డిసెంబరు 8న విడుదల.

ఉస్తాద్‌

ఆకాశంలో ఎగరాలని కలలు కనే ఓ యువకుడి కథ ఇది. శ్రీసింహా, కావ్యా కల్యాణ్‌రామ్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ఫణిదీప్‌ దర్శకుడు. ఈ ఆగస్టులో రిలీజ్‌ అయిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో అందుబాటులో ఉంది.

రన్‌వే 34

2015లో విమానయాన రంగంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అజయ్‌ దేవ్‌గణ్‌ స్వీయదర్శకత్వంలో నటించారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రధారి. గతేడాది విడుదలైంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఆకాశం నీ హద్దురా

ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందిన ఈ సినిమాలో సూర్య హీరో. సుధా కొంగర దర్శకురాలు. 2020లో నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదలైంది.

టాప్‌గన్‌: మావెరిక్‌

హాలీవుడ్‌ నటుడు టామ్‌క్రూజ్‌ హీరోగా జోసెఫ్‌ కోసిన్ష్కి తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో టామ్‌ ఫైటర్‌ పైలెట్‌గా కనిపిస్తారు. గతేడాది రిలీజ్‌ అయింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో అందుబాటులో ఉంది.

నెక్సా వేదికపై అందాల తారలు..

‘సరిపోదా శనివారం’లో తమిళ నటి

మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్స్‌

Eenadu.net Home