బబుల్‌గమ్‌.. పిజ్జా.. ఇవీ టైటిళ్లేనండీ!

#eenadu

నటుడు రాజీవ్‌ కనకాల, సుమ తనయుడు రోషన్‌ ‘బబుల్‌గమ్‌’తో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. మానస చౌదరి హీరోయిన్‌. యువతే లక్ష్యంగా రూపొందిన ఈ సినిమా డిసెంబరు 29న విడుదలవుతుంది. 

హీరో మహేశ్‌ బాబు- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబోలో వస్తోన్న మూడో చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. గుంటూరు నేపథ్యంలో సాగే ఈ సినిమా 2024 జనవరి 12న రిలీజ్‌ కానుంది.

తన తనయుడు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు కె. విజయభాస్కర్‌ తెరకెక్కించిన చిత్రమిది. శివానీ హీరోయిన్‌. ఈ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అవికాగోర్‌, సాయి రోనక్‌ జంటగా నటించిన ఈ ‘పాప్‌కార్న్‌’కు మురళి గంధం దర్శకత్వం వహించారు. ఈ ఫిబ్రవరిలో విడుదలైంది.

దిల్‌పసంద్‌..

కృష్ణ, నిశ్విక, మేఘా శెట్టి ప్రధాన పాత్రల్లో శివ తేజాస్‌ తెరకెక్కించిన ఈ కన్నడ సినిమా గతేడాది విడుదలైంది. 

భీమల్‌ కార్తీక్‌, సంచిత, కృష్ణ హెబ్బలే, కళాజ్యోతి ప్రధాన పాత్రల్లో రూపొందింది ఈ ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడీ’. జయంత్‌ గాలి దర్శకుడు. గతేడాది రిలీజ్‌ అయింది.

విభిన్న కాన్సెప్టులు పరిచయం చేస్తూ కడుపుబ్బా నవ్వించే నటుడు సంపూర్ణేశ్‌ బాబు. ఈయన హీరోగా ఆర్కే మలినేని తెరకెక్కించిన సినిమా ఇది. విడుదల: 2021.

మాసస్‌, నిత్యా నరేశ్‌, బ్రహ్మానందం, హైపర్‌ ఆది తదితరులు నటించిన ఈ సినిమాకి మల్లూరి హరిబాబు దర్శకత్వం వహించారు. 2018లో విడుదలైంది.

నవదీప్‌, తేజస్వి మదివాడ హీరో-హీరోయిన్లుగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఫిల్మ్‌ ఇది. 2014లో రిలీజ్‌ అయింది.

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు శివ కొరటాల కాంబోలో వచ్చిన మూవీ ఇది. అనుష్క కథానాయిక. 2013లో విడుదలైంది.

విజయ్‌ సేతుపతి, రమ్య నంబీసన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకుడు. 2012లో విడుదలైంది.

‘షాక్‌’ తర్వాత హీరో రవితేజ, డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2011లో విడుదలైంది. రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్‌ హీరోయిన్లు.

అల్లరి నరేశ్‌, స్నేహా ఉల్లాల్‌ జంటగా నటించిన ఈ సినిమాకి సీతారామరాజు దంతులూరి దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైంది.

రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం 2010లో రిలీజ్‌ అయింది. జెనీలియా హీరోయిన్‌.

నటుడు, దర్శకుడు అనీష్‌ కురువిల్లా రూపొందించిన ఈ సినిమాలో కమల్‌ కామరాజు, బిందు మాధవి జంటగా నటించారు. 2008లో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం.

రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా కాట్రగడ్డ రవితేజ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి కథ అందించారు. 1991లో విడుదలైంది. 

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

‘యానిమల్‌’ త్రిప్తి గురించి తెలుసా?

Eenadu.net Home