మిసెస్ వరల్డ్ @ 2022.. సర్గం కౌశల్
ఇటీవల లాస్ వెగాస్‌లో జరిగిన మిసెస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కి చెందిన సర్గం కౌశల్ విజేతగా నిలిచింది.
image:Instagram/sargam3
మొత్తం 63 దేశాల నుంచి పలువురు పోటీలో పాల్గొనగా.. మిసెస్ వరల్డ్ కిరీటం 2022 సర్గం కౌశల్‌ను వరించింది.
image:Instagram/sargam3
భారత్‌కి మిసెస్ వరల్డ్ కిరీటం 21 ఏళ్ల తర్వాత సర్గం తీసుకొచ్చింది. 2001లో అదితి గోవిత్రికర్ ఈ కిరీటాన్ని ధరించింది.
image:Instagram/sargam3
జమ్ముకశ్మీర్‌కు చెందిన సర్గం.. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది. భారత నౌకా దళం అధికారి ఆదిని 2017లో వివాహం చేసుకుంది.
image:Instagram/sargam3
పెళ్లైన తర్వాత మోడలింగ్ రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇటీవల జరిగిన మిసెస్ ఇండియా 2022 పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది.
image:Instagram/sargam3
మిసెస్ వరల్డ్ 2022 గెలిచిన అనంతరం సర్గం మాట్లాడుతూ ‘నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఎన్నో ఏళ్ల నుంచి కన్న కల నెరవేరింది.’ అని చెప్పుకొచ్చింది. తన విజయానికి కారణం కుటుంబ సభ్యులేనని తెలిపింది.
image:Instagram/sargam3
మోడలింగ్ రంగంలోకి రాకముందు సర్గం టీచర్‌గా పని చేసింది. కానీ, ఫ్యాషన్ రంగంపైనే ఆసక్తి ఉండేది. పెళ్లికి ముందు వీలుకాని తన ఆశయాన్ని పెళ్లయిన తర్వాత నెరవేర్చుకుంది.
image:Instagram/sargam3
ఇటీవల హైదరాబాద్‌ను సందర్శించిన సర్గం.. తన టూర్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
image:Instagram/sargam3
ఈమెకు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం. ఎక్కువ సమయం వాటితోనే గడుపుతుంటుంది.
image:Instagram/sargam3
This browser does not support the video element.
పెళ్లయి.. కుటుంబ బాధ్యతలు మీదపడ్డా.. ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయలేదు. ఫిట్‌గా ఉండేందుకు కసరత్తులు చేస్తుంటుంది.
image:Instagram/sargam3