నానికి జోడీగా ‘ప్రిన్సెస్ నూర్జహాన్’
ఒక్క సినిమాతోనే దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఫిదా చేసిన నటి మృణాల్ ఠాకూర్.
Image: Instagram/Mrunal Thakur
‘సీతారామం’లో సీతగా.. ప్రిన్సెస్ నూర్జహాన్‌గా అలరించిన మృణాల్ ఇప్పుడు టాలీవుడ్ హీరో నాని సరసన నటించనుంది.
Image: Instagram/Mrunal Thakur
నాని-మృణాల్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించనున్న చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం తాజాగా జరిగింది.
Image: Instagram/Mrunal Thakur
కోలీవుడ్‌లోనూ సూర్య 42వ చిత్రంలో ఈ సీత నటిస్తున్నట్లు సమాచారం. సూర్యకి ఇది తొలి పీరియాడిక్ సినిమా.
Image: Instagram/Mrunal Thakur
‘ముఝ్ సే కుచ్ కెహెతి.. యా ఖామూషియాన్’ టీవీ సీరియల్‌తో నటిగా కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్.. వెండితెరపై హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
Image: Instagram/Mrunal Thakur
మృణాల్ నటించిన తొలి రెండు సినిమాలు మరాఠీవే. మూడో చిత్రం ‘లవ్ సోనియా’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
Image: Instagram/Mrunal Thakur
ఆ తర్వాత అటు సీరియల్స్, ఇటు సినిమాలతో బీటౌన్‌లో బిజీగా మారిపోయింది. ‘సూపర్ 30’, ‘భాట్లా హౌస్’, ‘జెర్సీ’ తదితర చిత్రాల్లో నటించింది.
Image: Instagram/Mrunal Thakur
దర్శకుడు హను రాఘవపూడి ఏరికోరి మృణాల్‌ను ‘సీతారామం’ హీరోయిన్‌గా ఎంపిక చేశాడు.
Image: Instagram/Mrunal Thakur
ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది మృణాల్.
Image: Instagram/Mrunal Thakur
వెండితెరపై సీతగా ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించిన మృణాల్.. నిజ జీవితంలో చాలా ట్రెండీ.
Image: Instagram/Mrunal Thakur
తరచూ మోడ్రన్ దుస్తుల్లో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Mrunal Thakur
ప్రస్తుతం ఆమె హిందీలో నటించిన ‘గుమ్రా’ విడుదలకు సిద్ధమైంది. ‘పూజా మేరీ జాన్’, ‘ఆంఖ్ మిచోలి’ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.
Image: Instagram/Mrunal Thakur