సండే కేలరీల కౌంటేంటి? నచ్చింది తినడమే!

అడవి శేష్‌ హీరోగా వస్తోన్న ‘డెకాయిట్‌’లో శ్రుతిహాసన్‌ స్థానంలో మృణాల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.

ఈ ఏడాది ‘ఫ్యామిలీ స్టార్‌’తో అలరించిన మృణాల్‌ బాలీవుడ్‌లో అయిదు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది.

‘రేపటి గురించి భయం లేదు. ఓటమిలోనూ జీవితాన్ని ఆస్వాదించడం అలవడింది. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉన్నా’ అని చెప్పింది మృణాల్‌.

‘తోడీ కుస్తీ.. తోడీ మస్తీ’ అంటూ ఫిట్‌గా ఉండేందుకు రింగ్‌లోకి దిగి బాక్సింగ్‌ చేస్తోంది.

వారమంతా ఆహారం విషయంలో నోరు కట్టేసుకున్నా.. ‘సండే కేలరీస్‌ డోంట్‌ కౌంట్’ అంటూ నచ్చింది తింటుంది.

కార్‌ రేసింగ్‌ నచ్చుతుంది. రాత్రి వేళల్లో హైవే మీద రయ్‌ రయ్‌మంటూ చక్కర్లు కొడుతుంది.

విహారయాత్రకు వెళితే ప్రకృతిలో ప్రత్యేకంగా అనిపించిన ప్రతి విషయాన్ని కెమెరాలో బంధిస్తుంది.

ఖాళీ సమయం దొరికితే కవి అయిపోతుంది మృణాల్‌. రాసిన కవితల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది.

‘సన్‌సెట్‌లో బీచ్‌ కన్నా ప్రపంచంలో ఏది అందంగా ఉండదు. నాకైతే బీచ్‌లో సమయమే తెలియదు’ అని చెబుతోంది.

హీరోలతో రీల్స్‌ చేస్తూ వాటిని ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంది మృణాల్‌. ఈమె ఇన్‌స్టా ఖాతాకి కోటీ 37లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

తెలుగులో ‘డెకాయిట్‌’.. హిందీలో ‘పూజా మేరీ జాన్‌’, ‘హే జవానీ తో ఇష్క్‌ హోనా హై’, ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌ 2’, ‘తుమ్‌ హో తో’లో నటిస్తోంది.

ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు

శారీ.. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌

బాడీ షేమింగ్‌ టు ‘బాగీ 4’

Eenadu.net Home