ఆ ‘సీతా’ వెండి నవ్వులే.. మృణాల్ మెరిసెలే!
This browser does not support the video element.
‘సీతారామం’తో తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకుంది మృణాల్ ఠాకూర్.
Image:Instagram
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీతగా మృణాల్, రామ్‌గా దుల్కర్ సల్మాన్ జంట అద్భుత కెమిస్ట్రీతో క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Image:Instagram
‘సీతారామం’లో సంప్రదాయబద్ధంగా కనిపించిన మృణాల్ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీ, గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తోంది.
Image:Instagram
ఇటీవల పలు ఫ్యాషన్ షోల్లో పాల్గొని ఫొటోలకు పోజులిచ్చింది. వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది.
Image:Instagram
This browser does not support the video element.
మృణాల్ ఆగస్టు 1, 1991న మహారాష్ట్రలోని ధూలెలో జన్మించింది. మాస్ మీడియాలో డిగ్రీ చేసింది.
Image:Instagram
చదువుకుంటున్న రోజుల్లోనే టీవీ సీరియల్‌లో అవకాశం రావడంతో 2012-13లో ప్రసారమైన ‘ముఝ్‌సే కుచ్ కెహతీ యా ఖామూషియాన్’ సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది.
Image:Instagram
‘విట్టి దండు’ (మరాఠీ చిత్రం)తో తొలిసారి వెండితెరపై మెరిసిన ఈ భామ ‘లవ్ సోనియా’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
Image:Instagram
‘సూపర్ 30’,‘బాట్లా హౌస్’, ‘తుఫాన్’, ‘జెర్సీ’ చిత్రాల్లో నటించి హిందీ ప్రేక్షకుల మనసును దోచుకుంది.
Image:Instagram
టీనేజీలోనే మృణాల్ మానసిక కుంగుబాటుకు గురైందట. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు తనను వెంటాడేవని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Image:Instagram
కెరీర్‌పరంగా మృణాల్ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో నాలుగు సినిమాలున్నాయి.
Image:Instagram