నాలుగు పదుల వయసులోనూ తగ్గేదేలే..!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ సారథి నాలుగు పదుల వయసులోనూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌ 17 సీజన్‌లో ఫినిషర్‌గా బరిలోకి దిగుతూ మెరుపులు మెరిపిస్తున్నాడు.

తాజాగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 9 బంతుల్లోనే 2 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

లఖ్‌నవూపై మెరుపు ఇన్నింగ్స్‌ ద్వారా 42 ఏళ్ల ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. 40 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎల్‌లో 500 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 

40 ఏళ్లు దాటిన అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాడు కూడా ధోనీనే. కెప్టెన్‌ కూల్ తర్వాత క్రిస్‌ గేల్ (481) రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ 471 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున ‘ది వాల్‌’ ఆడిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 466 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. సచిన్ 40 ఏళ్లు దాటిన తర్వాత ఈ టోర్నీలో 164 పరుగులు చేశాడు.

ఈ ఐపీఎల్‌ స్టార్లకు వరల్డ్ కప్‌లో నో ఛాన్స్‌!

200+.. చెన్నై సూపర్‌ కింగ్స్‌దే రికార్డు!

ఈ సీజన్‌లో శతక వీరులు వీరే

Eenadu.net Home