ధోనీ అంటే క్రికెట్‌ మాత్రమే కాదు.. చాలా ఉన్నాయి!

భారత్‌ను మూడు ఫార్మాట్లలో ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. జులై 7న మిస్టర్‌ కూల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ధోనీ వ్యాపారాలు, అలాగే సంపాదన మార్గాలపై ఓ లుక్కేద్దామా...

Image: Rkc

ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతోన్న ధోనీకి యాజమాన్యం భారీ మొత్తంలోనే డబ్బు చెల్లిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో తలా రూ. 12 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Image: social media

అన్‌అకాడమీ, నావీ, ఓరియో, ఒప్పో, రెడ్‌బస్‌, గో డాడీ, ఇండిగో పెయింట్స్‌, భారత్‌ మ్యాట్రిమోనీ ఇలా అనేక బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లో నటిస్తూ రూ. కోట్లు సంపాదిస్తున్నాడు.

Image: social media

‘స్పోర్ట్స్‌ ఫిట్‌’ జిమ్‌లో ధోనీ భాగస్వామిగా ఉన్నాడు. ఈ జిమ్‌కి దేశవ్యాప్తంగా 200కుపైగా బ్రాంచ్‌లున్నాయి.

Image: social media

ధోనీకి ఫుట్‌బాల్‌ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఫుట్‌బాల్‌ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో చెన్నయిన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు యాజమాన్య భాగస్వామి కూడా.

Image: social media

హాకీ ఇండియా లీగ్‌లోనూ ధోనీ ఓ జట్టుకు యాజమాని. సొంత రాష్ట్రానికి చెందిన రాంచీ రేస్‌ జట్టును మరో వ్యక్తితో కలసి ధోని కొనుగోలు చేశాడు. 

Image: social media

మిస్టర్‌ కూల్‌కి బైక్స్‌, రేసింగ్‌ అంటే ఇష్టం. అందుకే, సూపర్‌ స్పోర్ట్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో ధోని ‘మహీ రేసింగ్‌ టీమ్‌ ఇండియా’ పేరుతో ఓ జట్టును ఏర్పాటు చేశాడు. 

Image: social media

సెవెన్‌ (7) పేరుతో మహీకి ఫుట్‌వేర్‌ బ్రాండ్‌ ఉంది. మొదట్లో దానికి అంబాసిడర్‌గా ఉన్న ఆయన.. తర్వాత సొంతం చేసుకున్నాడు.

Image: social media

ధోనీకి ఒక హోటల్‌ కూడా ఉందని తెలుసా? సొంతూరు రాంచీలో ‘హోటల్‌ మహీ రెసిడెన్సీ’ పేరుతో హోటల్‌ను నిర్వహిస్తున్నాడు.

Image: social media

కార్స్‌ 24, ఖాతా బుక్‌, డ్రోన్‌ తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్‌ లాంటి అనేక స్టార్టప్‌ కంపెనీల్లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు.

Image: social media

సినిమా ఇండస్ట్రీలోకి కూడా మహీ భాయ్‌ అడుగుపెట్టాడు. ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా నటించిన ‘ఎల్‌జీఎం’కు తనే నిర్మాత.

Image: social media

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home