ఆయన సినిమాలో నటించాలన్నదే నా డ్రీమ్‌..!

బాల‌కృష్ణ‌, బాబీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా(NBK109)లో చాందినీ చౌదరిది ఓ కీల‌క పాత్ర 

అందం.. అభినయంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి ‘కలర్‌ ఫొటో’తో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది.

ఈ ఏడాది ‘గామి’,‘యేవ‌మ్‌’తో పాటు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో నటించి మెప్పించింది.

లఘు చిత్రాలతో కెరీర్‌ మొదలు పెట్టిన చాందినికి హీరోయిన్‌గా తొలి సినిమా ‘కుందనపు బొమ్మ’.

నటిగా నాతో నేనే పోటీ పడాలనుకుంటా.

చేసే ప్రతి సినిమాలో నన్ను నేను కొత్తగా చూసుకోవాలనుకుంటా-చాందిని

‘నటించడమే కాదు.. స్టోరీలు రాస్తా.. ఛాన్స్‌ వస్తే డైరెక్షనూ చేస్తా’అంటోందీ బ్యూటీ.

‘ఇష్టమైన హీరో రజనీకాంత్‌, ఫేవరెట్‌ దర్శకుడు మణిరత్నం. ఆయన సినిమాలో నటించాలన్నదే నా డ్రీమ్‌’అని తన ఇష్టాన్ని చెప్పింది.

యాక్షన్‌ సన్నివేశాలను అలవోకగా చేసే చాందిని త్రోబాల్‌ చాంపియన్.

విశాఖ సాగర తీరంలో పుట్టిన ఈ ‘కుందనపు బొమ్మ’కు ట్రెక్కింగ్‌ చేయడం, జలపాతాల అందాన్ని ఆస్వాదించడం అంటే ఇష్టం.

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home