‘నక్షత్ర’ తెలుగులోనూ మెరుస్తోంది

‘పలాస 1978’లో రక్షిత్‌ అట్లూరి సరసన నటించి మెప్పించిన నక్షత్ర త్రినయని మరో తెలుగు చిత్రంతో అలరించింది.

Image:Nakshatra Trinayani/Twitter

ఎన్‌.సాందీప్‌ మైత్రేయ తెరకెక్కించిన ‘ఎర్రర్‌ 500’లో జస్వంత్‌ పడాలకు జోడీగా నటించింది. ఈ సినిమా ఇటీవల విడుదలైంది.

Image:Nakshatra Trinayani/Twitter

నక్షత్ర త్రినయని సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కన్నడ దర్శకుడు రాజేంద్రబాబు, నటి సుమిత్ర రెండో కుమార్తె ఈమె.

Image:Nakshatra Trinayani/Twitter

చెన్నైలోని ఈరోడ్ సెంగుంతర్ ఇంజినీరింగ్ కళాశాలలో బయోటెక్‌ చదివిన ఈ భామ నటననే కెరీర్‌గా ఎంచుకుంది.

Image:Nakshatra Trinayani/Twitter  

ఆమె నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయితే, అవకాశాలు రావడంతో ఇండస్ట్రీ వైపే అడుగులేసింది.

Image:Nakshatra Trinayani/Twitter 

గోకుల (కన్నడ) చిత్రంతో తెరంగేట్రం చేసింది నక్షత్ర. ఈ సినిమాలో చాలా సిగ్గుపడే అమ్మాయిగా కనిపించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది.

Image:Nakshatra Trinayani/Twitter

మలయాళంలో ఆమె నటించిన ‘వైదూర్యం’, ‘కిలి పాడు గ్రామం’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించాయి. మాలీవుడ్ చిత్రాల కోసం తన పేరుని దీప్తిగా మార్చుకుంది.

Image:Nakshatra Trinayani/Twitter 

‘డూ’,‘మరుధవేలు’, ‘ఆర్య సూర్య’లతో కోలీవుడ్‌ ప్రేక్షకులను కూడా పలకరించింది.

Image:Nakshatra Trinayani/Twitter

తెలుగులో మేఘాంశ్‌ శ్రీ హరితో ‘రాజ్‌దూత్‌’ (2019)లోనూ నటించింది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ‘గీతా సుబ్రమణ్యం’, ‘మెట్రో కథలు’ వెబ్‌సిరీస్‌ల్లోనూ మెరిసింది.

Image:Nakshatra Trinayani/Twitter  

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home