అదరగొట్టిన గంగూబాయి.. అలియానా మజాకా!
బాలీవుడ్ ‘గంగూబాయి’ అలియా భట్... ఇప్పుడు జాతీయ ఉత్తమ నటి అయిపోయింది. 2021లో వచ్చిన ఈ సినిమాలోని నటనకుగానూ ఉత్తమ నటి అవార్డు వరించింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోతోంది.
‘గంగూబాయి’ సినిమా ఓకే చేసిందని తెలిశాక దగ్గరివాళ్లు కూడా ఆమెను విమర్శించారట. ఇలాంటి పాత్ర ఓకే చేశావా? ఏమన్నా ఆలోచించావా అని ముఖం మీదే అడిగేశారట.
అలాంటి మాటలు విని వెనక్కి తగ్గే రకం కాదు అలియా.. అందుకే కెరీర్ ప్రారంభం నుంచే విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ వస్తోంది. ఆ ధైర్యమే ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేసింది. ఇప్పుడు జాతీయ ఉత్తమ నటి అయ్యింది.
This browser does not support the video element.
అదేదో సినిమాలో హీరో చెప్పినట్లు.. అలియా ఒకసారి ఫిక్స్ అయితే ఎంతకైనా ముందుకెళ్తుంది. అందుకు ఉదాహరణ ‘గంగూబాయి కాఠియావాడి’. మనసు మాట విని ఈ సినిమా చేశా అని చెప్పింది ఓసారి.
అవార్డు ప్రకటించిన తర్వాత అలియా సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక ఎమోషనల్ పోస్టు చేసింది. ‘నిజానికి ఈ అవార్డు మీదే.. ఒక వేళ మీరే లేకపోయి ఉంటే.. ఈ అవార్డు నాకు వచ్చేదే కాదు’ అంటూ అభిమానులను ఉద్దేశించి పేర్కొంది.
ఇక అలియా వ్యక్తిగత విషయాలకొస్తే.. 11 ఏళ్ల వయసులోనే రణ్‌బీర్ కపూర్ అంటే క్రష్ మొదలైందట. అలా ఈ విషయంలోనూ అనుకున్నట్టే రణ్‌బీర్‌ను తనవాడిని చేసుకుంది.
నటన విషయంలో చాలామందిని స్ఫూర్తిగా తీసుకుంటాను అని చెప్పే అలియా.. వదిన కరీనా కపూర్‌కి వీరాభిమాని.
చాలామంది నాయికలలాగే అలియాకి జంతువులంటే ప్రేమ ఎక్కువ. మూగజీవాలను సంరక్షించే పెటా సంస్థకు సపోర్టర్ కూడా.
వినడానికి విచిత్రంగా ఉంటుంది కానీ.. అలియా మగవారి పెర్‌ఫ్యూమ్‌లను ఎక్కువగా వాడుతుందట. చిన్నప్పట్నుంచే ఇలా చేసేదాన్నని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
విహారయాత్రలకు వెళ్లడం అంటే అలియాకి భలే ఇష్టం. కానీ విమాన ప్రయాణమంటే మాత్రం భయపడుతూనే చేస్తుందట.
ఉంటే ముంబయి.. లేదంటే లండన్... ఇదీ అలియా ఇంట్రెస్ట్. ఎప్పటికైనా లండన్‌లో తనకంటూ ఒక ఇల్లు ఉండాలన్నది తన కల. అంతలా ఈ నగరాన్ని ఆమె ఇష్టపడుతోంది.
రణ్‌బీర్ కపూర్‌ను వివాహం చేసుకొని రాహాకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల విరామం తీసుకొని మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
This browser does not support the video element.
తీరికలేకుండా షూటింగ్‌లు, వెకేషన్స్‌కు వెళ్లినా, ఫిట్‌నెస్‌కే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెబుతుంటుంది. అందుకే సినిమాల్లోకి వచ్చి పదేళ్లు అవుతున్నా అంత ఫిట్‌గా ఉంది.
(photos:instagram/aliaabhatt)