జుట్టు పెరిగేందుకు సహజ పద్ధతులివీ!
జుట్టు పెరగడం కోసం చాలా మంది రసాయనాలతో కూడిన హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడుతుంటారు. కానీ, వీటిని పాటిస్తే సహజంగానే జుట్టు బాగా పెరుగుతుంది. అవేంటంటే..
Image: RKC
వారానికి కనీసం రెండు సార్లు నూనెతో తలపై మర్దన చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగై జుట్టు తొందరగా పెరుగుతుంది. కాస్త వేడి చేసిన నూనెతో మర్దన చేసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది.
Image: RKC
మర్దన చేసేందుకు ఖరీదైన నూనెలు అక్కర్లేదు. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలీవ్ నూనె వాడినా సరిపోతుంది.
Image: RKC
రోజుకు కనీసం 8 గంటలు నిద్రించాలి. నిద్రలో ఉన్నప్పుడు దెబ్బతిన్న జుట్టు కుదుళ్ల కణాలు, ఇతర కణజాలాలు తిరిగి ఆరోగ్యంగా మారతాయి. దీంతో జుట్టు తొందరగా పెరుగుతుంది.
Image: RKC
తలస్నానం చేసేటప్పుడు మీ జుట్టు స్వభావాన్ని బట్టి షాంపూను ఎంచుకోవాలి. జుట్టులో ఉన్న దుమ్ముధూళీని షాంపూ తొలగించి.. వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతుంది. వారంలో మూడు సార్లు తలస్నానం చేయాలి.
Image: RKC
జడ వేసుకునే క్రమంలో జుట్టును గట్టిగా ముడి వేయొద్దు. దీని వల్ల కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలడం మొదలవుతుంది. వీలైనంత వరకు వదులుగా ఉండేలా చూసుకోవాలి.
Image: RKC
మనం తినే ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. జుట్టు పెరుగుదలకు కావాల్సిన ప్రోటీన్, విటమిన్ ఏ, బీ, ఈతోపాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవాలి.
Image: RKC
వెంట్రుకల చివరి భాగం వరకు పోషకాలు అందకపోవచ్చు. దీంతో చాలా మంది వెంట్రుకలు విరిగిపోతుంటాయి. అందుకే, సెలూన్‌కి వెళ్లి విరిగిపోతున్న వెంట్రుకలను కత్తిరించుకోవాలి. దీంతో జుట్టు మరింత బలంగా పెరుగుతుంది.
Image: RKC
రాత్రి పడుకునే ముందు జుట్టును దువ్వుకోవడం అలవాటు చేసుకోండి. దీని వల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ పెరిగి జుట్టు పెరుగుతుంది.
Image: RKC
రోజూ వ్యాయామం, యోగా చేయాలి దీని ద్వారా తలకు రక్తం, ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీంతో జుట్టు బాగా పెరుగుతుంది.
Image: RKC