అందంగా ఉండేందుకు.. సహజ పద్ధతులివే!

అందంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. వాతావరణానికి తగినట్టు ఎన్నో చిట్కాలను పాటిస్తారు. సహజ సిద్ధంగా కొన్ని సూచనలను పాటిస్తే అందం మీ సొంతం అవుతుంది అవేంటో తెలుసా..

image:RKC

 రోజూ కావాల్సినంత నీటిని తాగాలి. ఉదయం పూట గోరు వెచ్చని నీళ్లు తాగితే మరింత ప్రయోజనం కలుగుతుంది.

image:RKC

అందం పెంచుకోవడానికి నిద్ర చాలా అవసరం. కంటినిండా నిద్రపోతే ముఖం కాంతిమంతంగా మారుతుంది.

image:RKC

ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

image:RKC

ముఖం కాంతిమంతంగా ఉండేందుకు చాలా మంది బ్లీచింగ్‌ చేసుకోవడానికి సిద్ధమవుతారు. కానీ కీరా, కొత్తిమీర, పండ్లతో మసాజ్‌ చేసుకోవడంతో చర్మం మరింత మెరుస్తుంది.

image:RKC

కళ్లతోనే అమ్మాయిల అందం పెరుగుతుంది. ఆ కళ్లకు లైనర్‌ను ఎంపిక చేసుకునే సమయంలో కంపెనీ, దాని ప్రభావం పరిశీలించిన తర్వాత వాడాలి.

image:RKC

చర్మం నిగారింపు మీ సొంతం చేసుకోవాలంటే మాయిశ్చరైజేషన్‌ ఉండే సబ్బులు వాడాలి. చర్మ వైద్యుల సలహాలతో చర్మానికి రాసుకునే క్రీములను ఎంపిక చేసుకోవాలి.

image:RKC

అమ్మాయిలు గోళ్ల అందంపై మరింత శ్రద్ధ పెడుతుంటారు. గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ రాత్రి పడుకునేముందు గోరు వెచ్చని నూనెలో ఓ 2 నిమిషాల పాటు ఉంచండి. గోళ్లకు వేసుకొనే నెయిల్‌పాలిష్‌ల ఎంపికలో జాగ్రత్త వహించాలి.

image:RKC

సహజమైన అందాన్ని రాబట్టుకోవడానికి తగిన వ్యాయామం చేయాలి. దీంతో శరీరం సడలిపోకుండా ఉంటుంది.

image:RKC

వెంట్రుకలను ఆరబెట్టేందుకు హీటర్లను వాడుతుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. కురులను సహజపద్ధతిలోనే ఆరనివ్వాలి. లేదంటే కుదుళ్లు బలహీనమవుతాయి. వారానికి రెండుసార్లు తల స్నానం చేయాలి. తులసి, మందారం, శికాయలతో మర్దన చేసిన తర్వాత తల స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

image:RKC

 యోగా, ధ్యానం చేయడంతో పాటు పుస్తకాలు చదవడం మేలు చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తుంది.

image:RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home