మధుమేహాన్ని సహజంగా నియంత్రించడమెలా?

మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. దీన్ని అదుపులో పెట్టకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది.

Image: Pixabay

రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ కోసం మధుమేహులు ఔషధాలను వాడుతుంటారు. కానీ, ఆహార, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సహజంగానే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. అదెలా అంటే..

Image: Pixabay

తీసుకునే ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్స్‌, ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా తీసుకుంటే.. చక్కెర స్థాయులు తగ్గుతాయి.

Image: Pixabay

ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అమాంతం పెరుగుతాయి. కాబట్టి.. ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు స్వల్ప మొత్తంలో ఆహారం తీసుకోవాలి.

Image: Unsplash

తినే ఆహారంలో ఫైబర్‌ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇది కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే ప్రక్రియ నిదానంగా జరిగేలా చేస్తుంది.

Image: Unsplash

సరిపడా నిద్ర ఉంటే రక్తంలో చక్కెరస్థాయులు నియంత్రణలో ఉంటాయి. అందుకే, రోజుకు కనీసం 6-8 గంటలు నిద్రపోవాలి.

Image: Unsplash

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తరచూ నీళ్లు తాగాలి. ముఖ్యంగా మధుమేహులు శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలంటే నీళ్లు తాగాల్సిందే.

Image: Unsplash

చక్కెరగా మారిన కార్బోహైడ్రేట్స్‌ నుంచి శరీరం శక్తిని పొందుతుంది. రోజు వ్యాయామం చేయడం వల్ల అధిక చక్కెరను కండరాలు వినియోగించుకుంటాయి. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

Image: Unsplash

అతిగా ఆలోచించకండి..

పెసరపప్పు గురించి ఇవి తెలుసా?

టైప్‌- 2 మధుమేహానికి చెక్‌ పెడదాం!

Eenadu.net Home