ఆ పల్లవి నేనేనండీ.. ఆయ్‌!

నార్నె నితిన్ సరసన ‘ఆయ్‌’తో టాలీవుడ్‌లో మరోసారి మెరిసింది నయన్‌ సారిక. ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటోంది.

గోదావరి నేపథ్యంలో కామెడీ థ్రిల్లర్‌గా సాగే ఈ కథను అంజి కె. మణిపుత్ర తెరకెక్కించారు. ఈ సినిమాలో పల్లవి పాత్రలో సారిక మెరిసింది. 

ఈ ఏడాది మే నెలలో విడుదలైన ‘గం గం గణేశా’తో ఆనంద్‌ దేవరకొండ సరసన తెలుగులో ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. 

అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే ఈ భామది మహారాష్ట్ర. డిగ్రీ పూర్తి చేసిన సారిక ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది.

‘జీవితంలో మంచో చెడో.. ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ అధిగమించి ముందుకెళ్లాలి. అప్పుడే విజయాన్ని అందుకోగలం’ అని అంటోంది సారిక.

‘నాకు తెలుగు రాదు. ‘ఆయ్‌’ షూటింగ్‌లో డైరెక్టర్‌తో ఎన్నో సార్లు తిట్లు తిన్నా. ఆయన పదే పదే ‘ఇది ఇలా కాదు.. అలా చేయాలి’ అని చెప్పడం వల్లే సినిమాలో నా పాత్ర అంత బాగా వచ్చింది’ అని చెప్పిందీమె.

సారికకు పురాతన కట్టడాలు అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం దొరికితే కొత్త కొత్త ప్రదేశాలను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది.

స్విమ్మింగ్‌ చేయడం, పెంపుడు శునకాలతో ఆడుకోవడం హాబీ.. ‘అదీ వర్షంలో స్విమ్మింగ్‌ చేస్తే ఆ కిక్కే వేరబ్బా’ అంటోందీమె.

తరచూ ఫొటోషూట్లతో నెట్టింట హడావుడి చేస్తుంటుంది. ‘అప్పుడప్పుడూ గుడికి వెళ్లి వస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. ఎరుపు రంగంటే చాలా ఇష్టం. ఇన్‌స్టాలోనూ రెడ్‌కలర్‌ దుస్తుల ఫొటోలే ఎక్కువ.

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home